బాధ్యతగా విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:36 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం మల్కాపూర్ గేట్ సమీపంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- రవాణా శాఖ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం మల్కాపూర్ గేట్ సమీపంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ అక్కడి ప రిపాలనా వ్యవహారాలు, ప్రజ లకు అందుతున్న సేవలు, సి బ్బంది పనితీరును స్వయం గా పరిశీలించారు. పలు రికా ర్డులు దరఖాస్తుల వివరాలు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. కార్యాలయా నికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ ని బంధనల ప్రకారం సేవలు అం దుతున్నాయా లేదా అనే అంశా లను కూడా పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరై సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అ న్నారు. కలెక్టర్ వెంట జిల్లా రవాణా శాఖకార్యా లయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి
కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణం లో బుధవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర శాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని సిలార్ పల్లి, ఈదుల చెరువులను సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ముని సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్, తహసీల్దార్ ఇబ్రహీం, మునిసిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, కల్వకుర్తి సీఐ భీమ్‌కుమార్, కాంగ్రెస్ పట్ట ణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్ పాల్గొన్నారు.