Share News

ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి

ABN , Publish Date - May 16 , 2026 | 04:35 AM

ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభు త్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు..

ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి

  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభు త్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణం గా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండస్ర్టియల్‌ పార్కులు, ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు, లాజిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్కిల్లింగ్‌ ఎకో సిస్టం, ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్స్‌ అభివృద్థిపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. శుక్రవారం బేగంపేట్‌లో నిర్వహించిన ‘‘48వ ఈఈపీసీ ఇండియా సదరన్‌ రీజియన్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌పోర్ట్‌’’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2024--25లో భారత్‌ నుంచి ఇంజనీరింగ్‌ ఎగుమతులు రికార్డు స్థాయిలో 116.67 బిలియన్‌ డాలర్లు దాటాయన్నారు. ఇది మొత్తం మర్చండైస్‌ ఎగుమతుల్లో 27 శాతానికి చేరుకోవడం మన ఆర్థిక వ్యవస్థ పరిణతికి నిదర్శనమన్నారు. దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతుల వృద్థిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఏరో స్పేస్‌, డిఫెన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఫార్మా, ఈవీ మొబిలిటీ తదితర రంగాల్లో జాతీయ స్థాయిలో మన వాటా రోజురోజుకీ పెరుగుతోందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఇంజనీరింగ్‌ ఎగుమతులు 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం ఇక్కడి పారిశ్రామికాభివృద్థికి నిదర్శనమన్నారు. గతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌, టెక్నాలజీ వేర్వేరు అని, ఇప్పుడు మాత్రం ఆ రెండింటిని అనుసంధానిేస్తనే గ్లోబల్‌ సప్లై చైన్‌లో కీలక పాత్ర పోషించగలమన్నారు. ఆ దిశగా ‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ’ బ్రాండ్‌ ను మరింత విశ్వవ్యాప్తం చేేసలా ఏఐ, ఆటోమేషన్‌, రోబోటిక్స్‌, డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌తో కూడిన ఎకో సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేేసందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. హైదరాబాద్‌ లో ఈఈపీసీ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, ఈఈపీసీ ఇండియా ప్రతినిధులు పంకజ్‌ చాడ, రామన్‌ రఘు, శశి లూయిస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 04:35 AM