Share News

డ్రగ్స్‌ కేసులో నిందితులకు దుబాయ్‌లో ఖాతాలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:06 AM

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రోహిత్‌రెడ్డితో పాటు మరికొందరికి ...

డ్రగ్స్‌ కేసులో నిందితులకు దుబాయ్‌లో ఖాతాలు

  • విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి

  • మరో రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రోహిత్‌రెడ్డితో పాటు మరికొందరికి దుబాయ్‌లో బ్యాంకు ఖాతాలున్నట్లు సిట్‌ గుర్తించింది. ఈ ఖాతాల నుంచే డ్రగ్స్‌ సరఫరాదారులకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. రోహిత్‌రెడ్డి, డ్రగ్స్‌ పెడ్లర్ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణల్లో సరైన సమాచారం రాబట్టకపోవడంతో, సిట్‌ అధికారులు గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో నాల్గోసారి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు శుక్రవారం నిందితులను మరో రెండు రోజుల పాటు (శనివారం, ఆదివారం) కస్టడీకి అనుమతించింది. దీంతో శనివారం రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌ శర్మలను పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఈ డ్రగ్స్‌ పార్టీలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి, అసలు ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ ఎక్కడి నుంచి నడుస్తోంది అనే అంశాలపై సిట్‌ అధికారులు ఈ రెండు రోజుల్లో స్పష్టత తెచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

Updated Date - Apr 11 , 2026 | 05:06 AM