‘విద్య’లో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరం: డీటీఎఫ్
ABN , Publish Date - Aug 09 , 2026 | 06:16 AM
విద్యారంగంలో రోజు రోజుకు స్వచ్ఛంద సంస్థల జోక్యం పెరుగుతోందని, అవి నిత్యం నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదికి దూరం అవుతున్నారని..
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగంలో రోజు రోజుకు స్వచ్ఛంద సంస్థల జోక్యం పెరుగుతోందని, అవి నిత్యం నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదికి దూరం అవుతున్నారని ప్రజాస్వామ్య ఉపాధ్యాయ సమాఖ్య(డీటీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య అధ్యక్షతన శనివారం నగరంలోని టీఎన్జీవో భవన్‌లో జరిగింది. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, లింగారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల జోక్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కుంటుపడుతోందని ఆరోపించారు.