Share News

నిజామాబాద్‌ జైలులో గంజాయి వాడకం నిజమే!

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:35 AM

నిజామాబాద్‌ కేంద్ర కారాగారంలో గంజాయి వాడకం నిజమేనని సీఎంవోకు ఈగల్‌ అధికారులు నివేదిక అందజేశారు. నిజామాబాద్‌ జైలులో ఖైదీలు గంజాయి వాడకంతోపాటు...

నిజామాబాద్‌ జైలులో గంజాయి వాడకం నిజమే!

  • సీఎంవోకు ఈగల్‌ అధికారుల నివేదిక

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : నిజామాబాద్‌ కేంద్ర కారాగారంలో గంజాయి వాడకం నిజమేనని సీఎంవోకు ఈగల్‌ అధికారులు నివేదిక అందజేశారు. నిజామాబాద్‌ జైలులో ఖైదీలు గంజాయి వాడకంతోపాటు ఇద్దరు ఖైదీలపై జైలు అధికారుల దాడి చేసిన ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడం సంచలనం సృష్టించింది. గంజాయి ఘటనపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా.. ఐజీ, డీఐజీ నేతృత్వంలో విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. అయితే, సీఎంవో ఆదేశాల మేరకు విచారణ చేపట్టి పూర్తి చేసిన ఈగల్‌ అధికారులు జైలులో గంజాయి వాడకం నిజమేనని తేల్చారు. అదే విషయాన్ని సీఎంవోకు నివేదిక అందజేశారు. కాగా, నిజామాబాద్‌ జైలు ఘటన నేపథ్యంలో ఖైదీలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసేందుకు బాడీ స్కానర్లు ఏర్పాటు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 20 , 2026 | 01:35 AM