Share News

kumaram bheem asifabad- జిల్లాలో ముసురు వాన

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:32 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని 15 మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో పత్తిపం టకు జీవం పోసినట్లయింది. వర్షానికి వట్టివాగు, కుమరంభీం ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది. కుమరం భీం ప్రాజెక్టులోకి 2,172 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

kumaram bheem asifabad- జిల్లాలో ముసురు వాన
కాగజ్‌నగర్‌ పెద్దవాగులో పెరిగిన నీటి మట్టం

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని 15 మండలాల్లో ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో పత్తిపం టకు జీవం పోసినట్లయింది. వర్షానికి వట్టివాగు, కుమరంభీం ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది. కుమరం భీం ప్రాజెక్టులోకి 2,172 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,378 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో పెద్దవాగు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచించారు. రెబ్బెన మండలంలో అత్యధికంగా 93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగజ్‌నగర్‌లో 78.8, కెరవె ురిలో 64.3, వాంకిడిలో 48.8, ఆసిఫాబాద్‌లో 38.5, పెంచికల్‌ పేటలో 38, దహెగాంలో 33, సిర్పూర్‌(టి)లో 28.5, బెజ్జూరులో 24.5, తిర్యాణిలో 18 మిల్లీవీఎడతెరిపి లేని వర్షం

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు మండలంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. చిరు వ్యాపారులు దుకాణాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షం కురియటంతో రోడ్డుపై గుంతల్లో నీరు చేరటంతో వాహనదారులకు ఇబ్బందికలిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. స్థానిక పెద్దవాగులో నీటి మట్టం పెరిగింది. ఉదయం నుంచి వర్షం కురియటంతో పట్టణ వాసులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు మురుసు వార కురిసింది. సుమారు 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కురిసిన వర్షాలతో పంటలకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం సోయాబీన్‌ పంట కాయ దశలో ఉంది. పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. వర్షాభావంతో వాడిపోతున్న పంటలకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా వర్షాలు కురిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:32 PM