Share News

kumaram bheem asifabad- వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా చూడాలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:08 PM

వేసవిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట భవన సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి మిషన్‌ భగీరథ, ఇంట్రా, గ్రిడ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో వేసవిలో నిరంతర తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వేసవిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట భవన సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి మిషన్‌ భగీరథ, ఇంట్రా, గ్రిడ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో వేసవిలో నిరంతర తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జల్‌ సేవ అంకలన్‌ పథకం కింద జిల్లాలో 15 గ్రామపంచాయతీలు ఎంపికయ్యాయని అన్నారు. ఈ నెల 20వ తేదీన సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి తాగునీటిపై చర్చించాలని తెలిపారు. ఫిబ్రవరిలో ప్రతి తాగునీటి వనరును తనిఖీలు నిర్వహించాలని, వచ్చే వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పైప్‌లైన్‌ మరమ్మతులు చేపట్టాలని, ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీటిని అందించే విధంగా గ్రామాల్లో సర్పంచ్‌ల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారా యణ, డీపీవో భిక్షపతి, ఇంజనీరింగ్‌ అధికారులు సిద్దిక్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి వనులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అటవీ అధికారి అప్పయ్యలతో కలిసి అటవీ, నీటి పారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులతో నీటి వనరుల రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 150 చెరువులను చిత్తడి నేల (వెబ్‌ ల్యాండ్‌)గా గుర్తించామని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఆయా చెరువులను సందర్శించి అవసరమైన వేదికలను రూపొందించి అందించాలని తెలిపారు. చెరువులు ధ్వంసం కాకుండా రక్షించడం ప్రతి ఒక్కరీ బాధ్యత అని చెప్పారు. చెరువులలో నీరు నిలువ ఉంటే పవువులు, జంతువులు, పశువులకు దాహార్తి తీరుతుందన్నారు. మత్స్యకారులు చేపలు పెంచడం ద్వారా జీవనోపాధి పొందుతారని అన్నారు. రైతులు చెరువు ఆయకట్టు కింద పంట సాగు చేసుకుంటారని తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీరు నిలువ ఉండే శిఖం ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా, పర్యావరణ హితంగా పతంగులను ఎగురవేసే గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు ప్రభాకర్‌, గుణవంతరావు, అశ్వక్‌ అహ్మద్‌, అటవీ, ఇతర శాఖల అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 10:08 PM