Share News

డీఆర్‌డీఎల్‌ సైంటిస్ట్‌ ప్రకాశ్‌ జైన్‌కు మనోహర్‌ జోషి అవార్డు

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:21 AM

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ల్యాబ్‌(డీఆర్‌డీఎల్‌)కు చెందిన శాస్త్రవేత్త ప్రకాశ్‌చంద్‌ జైన్‌కు ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషి అవార్డు లభించింది.

డీఆర్‌డీఎల్‌ సైంటిస్ట్‌ ప్రకాశ్‌ జైన్‌కు మనోహర్‌ జోషి అవార్డు

అల్వాల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ల్యాబ్‌(డీఆర్‌డీఎల్‌)కు చెందిన శాస్త్రవేత్త ప్రకాశ్‌చంద్‌ జైన్‌కు ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషి అవార్డు లభించింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ఆయన చేసిన విశేష పరిశోధనలు, దేశ రక్షణ రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఫెడరేషన్‌ ఫర్‌ వరల్డ్‌ అకడమిక్స్‌(ఎఫ్‌డబ్య్యూఏ) ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మనోహర్‌ జోషి చేతుల మీదగా జైన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసి సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసిన ప్రముఖులను ఈ పురస్కారంతో సత్కరిస్తారు. డీఆర్‌డీఎల్‌లో శాస్త్రవేత్తగా.. క్షిపణుల రూపకల్పన, వైబ్రేషన్‌ సమస్యలు, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ తదితర అంశాల్లో జైన్‌ విశేష పరిశోధనలు చేశారు. క్షిపణుల బరువును తగ్గించేలా ఆయన రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం దేశీయంగా క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడింది.

Updated Date - Nov 23 , 2026 | 03:27 AM