Share News

ఫార్మసీల్లో డబ్ల్యూహెచ్‌వో సూచించిన ఓఆర్‌ఎస్‌నే ఉంచాలి

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:03 AM

కార్పొరేట్‌ కంపెనీల తప్పుడు మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌ ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ చేపట్టారు.

ఫార్మసీల్లో డబ్ల్యూహెచ్‌వో సూచించిన ఓఆర్‌ఎస్‌నే ఉంచాలి

  • దాని పేరుతో ఓఆర్‌ఎస్‌ఎల్‌, ఈఆర్‌జెడ్‌ఎల్‌ను అమ్మకూడదు

  • డాక్టర్‌ శివరంజని సంతోష్‌ మరో పోరాటం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ కంపెనీల తప్పుడు మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌ ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. అధిక షుగర్‌ ఉన్న ఓఆర్‌ఎస్‌ విక్రయాలకు వ్యతిరేకంగా ఎనిమిదేళ్ల పాటు పోరాడి, వాటి అమ్మకాలకు బ్రేక్‌ వేయించడంలో విజయం సాధించిన ఆమె మరో పోరాటం చేపట్టారు. ఫార్మసీల్లో ఎనర్జీ, రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఈఆర్‌జెడ్‌ఎల్‌), ఓరల్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్ఎల్‌)లను అసలైన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎ్‌స)కు ప్రత్యామ్నాయంగా ప్రచారం చేస్తున్న తీరుపై ఆమె పలు వేదికల ద్వారా ప్రశ్నిస్తున్నారు. దీంతో పలు కార్పొరేట్‌ కంపెనీలు ఆమెకు ఇటీవల లీగల్‌ నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె కార్పొరేట్‌ కంపెనీల తప్పుడు మార్కెటింగ్‌పై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఇది ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని స్పష్టం చేశారు. కేవలం డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లనే ఫార్మసీల్లో ఉంచాలని, మిగతావాటిని అమ్మకుండా నిరోధించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 04:03 AM