Share News

ప్రజా వైద్యురాలు.. పుర పాలకురాలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:07 AM

ప్రజా వైద్యురాలిగా పేరుతెచ్చుకున్న డాక్టర్‌ కాపా చంద్రకళ ఖమ్మం జిల్లా వైరా మునిసిపాలిటీ చైర్‌ పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ప్రజా వైద్యురాలు.. పుర పాలకురాలు

వైరా, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రజా వైద్యురాలిగా పేరుతెచ్చుకున్న డాక్టర్‌ కాపా చంద్రకళ ఖమ్మం జిల్లా వైరా మునిసిపాలిటీ చైర్‌ పర్సన్‌గా ఎన్నికయ్యారు. సుమారు 20ఏళ్లుగా గైనకాలజిస్టుగా సేవలందిస్తున్న ఆమె ఇప్పటి వరకు వేల మందికి ప్రసవాలు చేసిన రికార్డు సాధించారు. సాధారణ ప్రసవాల్లో కూడా ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్‌ వైద్యులందరిలో ముందుంటున్నారు. ఈ నెల 3 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న చంద్రకళ మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆరో వార్డు నుంచి గెలిచారు. చైర్‌పర్సన్‌ మహిళకు రిజర్వు కావడం ఆమెకు కలిసివచ్చింది.

Updated Date - Feb 17 , 2026 | 07:08 AM