Share News

kumaram bheem asifabad- శిథిలావస్థలో డీఆర్‌ డిపోలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:47 PM

. దీంతో సరకుల నిల్వ కష్టమవుతున్నా అధికారులు పట్టించ ుకోవడం లేదని చెబుతున్నారు. రేషన్‌ లబ్ధిదారులకు ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తున్నారు. బియ్యాన్ని నిల్వను ఆయా చౌక ధరల దుకాణాలకు పంపించారు. అయితే గిరిజన సహకార సంస్థలో(జీసీసీ) నిల్వ గదుల దుకాణ(డీఆర్‌డిపో)లు శిథిలావస్థకు చేరుకోవడం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

kumaram bheem asifabad- శిథిలావస్థలో డీఆర్‌ డిపోలు
శిథిలావస్థలో కెరమెరి డీఆర్‌ డిపో భవనం

- వెంటనే మరమ్మతులు చేపట్టాలని వినతి

కెరమెరి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏర్పాటు చేసిన డీఆర్‌ డిపో భవనాలు శిథిలాస్థకు చేరకున్నాయి. దీంతో సరకుల నిల్వ కష్టమవుతున్నా అధికారులు పట్టించ ుకోవడం లేదని చెబుతున్నారు. రేషన్‌ లబ్ధిదారులకు ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తున్నారు. బియ్యాన్ని నిల్వను ఆయా చౌక ధరల దుకాణాలకు పంపించారు. అయితే గిరిజన సహకార సంస్థలో(జీసీసీ) నిల్వ గదుల దుకాణ(డీఆర్‌డిపో)లు శిథిలావస్థకు చేరుకోవడం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో డీఆర్‌డిపోల భవనాల నిర్వహణ సరిగా లేక పోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. దశాబ్దాల కిందట కట్టినవి కావడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. దీనికి తోడు నిర్వహణ సైతం పట్టించుకోక పోవడం తో సరుకుల నిల్వలు చేయడం ఇబ్బందికరంగా ఉంది. వానాకాలంలో పైకప్పు ఊరుస్తుం డడంతో సరకులను కాపాడుకునేందుకు సేల్స్‌మెన్‌లు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

- జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో 15 డీఆర్‌డీపోలు ఉన్నాయి. ఇందులో మూడింటికి ఇప్పటి వరకు భవనం కూడా మంజూ రు కాలేదు. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో కొనసాగు తున్నాయి. జీసీసీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు ప్రతీ నెల రేషన్‌ సరుకులతో పాటు తేనె, ఇప్పపూలు, ఇప్ప పరకా, మైనం, చిల్ల గింజలు, కానుగ గింజలు తదితర అటవీ ఉత్పత్తులు ఇతర సరుకులను విక్రయిస్తున్నారు. కెరమెరిలోని డీఆర్‌డి పో భవనాన్ని 50 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రస్తుతం పూర్తిగా శిథి లావస్థకు చేరింది. దీంతో సిబ్బంది భయాందోళనలోనే పని చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మూడేళ్ల కిందట ఖాళీ చేసి ఓ అద్దె భవనం లో కొనసాగిస్తున్నారు. ఇక్కడ 1,716 మంది రేషన్‌దారులున్నారు. ఇది మండల కేంద్రంలో ఉండడంతో నిత్యం రద్దీగా ఉం టుంది. అద్దె భవనంలో కొనసాగుతుండ డంతో సరకుల నిల్వలకు ఇబ్బందులు ఏర్ప డుతున్నాయి. ఈ విషయమై జీసీసీ మేనేజర్‌ తారచంద్‌ను వివరణ కోరగా శిథిలావస్థకు, భవనాలు లేని డీఆర్‌డిపోలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామని చెప్పారు. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Aug 22 , 2026 | 11:47 PM