Share News

టీవీవీపీ ఇన్‌చార్జి కమిషనర్‌గా క్రిస్టినా జడ్‌ చోంగ్థు

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:50 AM

తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌(టీవీవీపీ) ఇన్‌చార్జి కమిషనర్‌గా హెల్త్‌ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్థు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ పదవీ...

టీవీవీపీ ఇన్‌చార్జి కమిషనర్‌గా క్రిస్టినా జడ్‌ చోంగ్థు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌(టీవీవీపీ) ఇన్‌చార్జి కమిషనర్‌గా హెల్త్‌ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్థు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ పదవీ కాలం మే 31తో ముగిసింది. పూర్తిస్థాయి కమిషనర్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో సర్కారు తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా హెల్త్‌సెక్రటరీకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా టీవీవీపీ పరిధిలో 184 ఆస్పత్రులుండగా, పదివేల మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా ప్రభుత్వ జీవో నంబరు 1 మేరకు పదవీ విరమణకు కనీసం రెండేళ్ల వ్యవధి ఉన్నవారిని, సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న వైద్యులనే నియమించాలి. అలాగే విభాగాధిపతి కార్యాలయంలో అనుభవం ఉన్నవారినే నియమించాలన్న నిబంధన సైతం ఉంది. మరోవైపు రాజకీయ పైరవీలకు తావు లేకుండా కేవలం సీనియారిటీ ప్రాతిపదికన కొత్త కమిషనర్‌నను నియమించాలని సర్కారుకు వైద్యసంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Updated Date - Jun 02 , 2026 | 04:50 AM