Share News

టీఎస్ఎల్‌డీఏ చైర్మన్‌గా చరణ్‌ కౌశిక్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - May 14 , 2026 | 04:09 AM

తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్‌డీఏ) చైర్మన్‌గా ఇటీవల నియమితుడైన డాక్టర్‌ చరణ్‌ కౌశిక్‌యాదవ్‌.. బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

టీఎస్ఎల్‌డీఏ చైర్మన్‌గా చరణ్‌ కౌశిక్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్‌డీఏ) చైర్మన్‌గా ఇటీవల నియమితుడైన డాక్టర్‌ చరణ్‌ కౌశిక్‌యాదవ్‌.. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పశుసంపద అభివృద్ధి, రైతుల సంక్షేమం, లైవ్‌స్టాక్‌ రంగంలో సంస్కరణల అమలుకు తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఏజెన్సీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు, పార్టీ నాయకులు కూన శ్రీశైలంగౌడ్‌, హరివర్ధన్‌రెడ్డి, మెట్టు సాయికుమార్‌, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 04:09 AM