Share News

పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రూస్‌ లెవిన్‌కు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:25 AM

పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌ తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్‌’ అవార్డుకు ఎంపికయ్యారు

పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రూస్‌ లెవిన్‌కు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌ తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా కణజాలాలు, జన్యువుల చికిత్స, కార్‌ టీ-సెల్‌ ఆవిష్కరణల్లో ఆయన చేసిన అద్భుత కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 17, 18న జరగనున్న బయో ఆసియా సదస్సులో బ్రూస్‌ లెవిన్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ప్రపంచస్థాయిలో బయో మెడికల్‌ పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లడంలో బ్రూస్‌ లెవిన్‌ ఆదర్శనీయులని, ఆయనకు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రకటించడం సంతోషకరమైన అంశమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కార్‌ టీ -సెల్‌ థెరపీ, జీన్‌ ఎడిటింగ్‌లో ఆయన చేసిన కృషి, ఆవిష్కరణలు, వైద్యశాస్త్ర భవిష్యత్తును మార్చబోతున్నాయన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 02:25 AM