Share News

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:11 AM

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ...

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

ఆన్‌లైన్‌లో ఫీజు చె ల్లింపునకు చివరి తేది ఆగస్టు 7

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా, తదితర కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైనట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. డిగ్రీ (బీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ), పీజీ -ఎంఏ, ఎం.కాం, ఎం.ఎస్సీ,, ఎం.ఎల్‌ ఐఎస్సీ, డిప్లొమా, తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలు Http://www.brauonline.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని అధికారులు తెలిపారు. వివరాలకు విశ్వవిద్యాలయ హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 73829 29570, 040-23680222/333/555లో లేదా టోల్‌ ఫ్రీ నెం.18005990101లో సంప్రదించవచ్చని సూచించారు.

Updated Date - Jun 24 , 2026 | 05:11 AM