Share News

మామిడి పండ్ల ఎగుమతితో రెట్టింపు ఆదాయం

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:34 PM

జిల్లాలో మేలు రకాలైన మా మిడి పండ్లు సాగవుతున్నాయని, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన అధికారి అనీత అన్నారు. ఎగుమతులపై ఆసక్తిగా ఉన్న రైతులకు అ పేడా సహకారంతో, ఉద్యాన శాఖ తగిన గైడెన్స్‌తో పాటు ప్రోత్సాహం ఇస్తుందన్నారు.

మామిడి పండ్ల ఎగుమతితో రెట్టింపు ఆదాయం
మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన అధికారి అనీత

జిల్లా ఉద్యాన అధికారి అనిత

నెన్నెల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మేలు రకాలైన మా మిడి పండ్లు సాగవుతున్నాయని, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన అధికారి అనీత అన్నారు. ఎగుమతులపై ఆసక్తిగా ఉన్న రైతులకు అ పేడా సహకారంతో, ఉద్యాన శాఖ తగిన గైడెన్స్‌తో పాటు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. అపేడా (అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రోసెస్సెడ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)హైదరాబాద్‌, జిల్లా ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నెన్నెల మండలం చిత్తాపూర్‌ రైతువేదికలో సోమవారం మామిడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మార్కెటింగ్‌ మెలుకువలు, విదేశాలకు ఎగుమతి అవకాశాలు, సొంత బ్రాండిం గ్‌పై రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీహెచ్‌ఎస్‌వో మాట్లాడుతూ మన ప్రాంతంలో పండే బంగినపల్లి, దశేరి రకాలు ఎగుమతి చేయవచ్చన్నారు. ఎక్స్‌పోర్ట్‌ చే యాలంటే పూతదశ నుంచే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంద న్నారు. పరిమితికి మించి రసాయణ మందులు వాడకూడదని సూ చించారు. పండ్లలో రసాయణ అవశేషాలు ఉంటే తిరస్కరణకు గు రవుతాయని చెప్పారు. నాన్యతప్రమాణాలు పాటిస్తేనే అంతర్జాతీ యంగా మంచి ధర లభిస్తుందన్నారు. అపేడా ప్రతినిధి ఎంఏ అబ్ధుల్‌ ఖాదర్‌ తమ సంస్థ రైతులకు అందించే సేవలు, ఎగుమతుల్లో నిబం ధనల గూర్చి వివరించారు. దేశాలను బట్టి గైడ్‌లైన్స్‌ మారుతాయన్నారు. రైతులు ఇంపోర్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ కోడ్‌ నంబరు, అపేడా రిజీస్ట్రేషన్‌, మెంబర్‌షిప్‌ (ఆర్‌సీఎంసీ) తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నేరుగా ఎగుమతి చేయలేని రైతులకు ఈపాటికే అనుమతులు పొం దిన సంస్థల సాయంతో అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పిస్తా మన్నారు. విలువ ఆధారిత ఉత్పత్తులైన జ్యూస్‌, ఆమ్‌చూర్‌, పౌడర్‌ లతో మంచి ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో నెన్నెల, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, హార్టికల్చర్‌ అధికారులు అరుణ్‌కుమార్‌, అర్చన, కళ్యాణీ, సహజ, టెక్నికల్‌ ఆఫీసర్‌ తిరుపతి, నెన్నెల ఏవో పుప్పాల సృజన, హెచ్‌ఈవో కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 11:35 PM