24, 25 తేదీల్లో ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్లు
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:32 AM
దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల తేదీలను ప్రకటించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల తేదీలను ప్రకటించారు. కాలేజీలవారీగా ఖాళీ సీట్ల వివరాలు అన్ని కాలేజీల్లో 23న ప్రదర్శిస్తారు. వీటిని విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. ఈ నెల 24, 25న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి తెలిపారు. స్పాట్ అడ్మిషన్‌లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని, రూ.425 రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.