Share News

kumaram bheem asifabad- చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

ABN , Publish Date - May 14 , 2026 | 10:48 PM

ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తిగత దాడులకు పాల్పడడం చట్ట రీత్యా నేరమని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గోరక్షణ కమిటీ సభ్యులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోక్షకుల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడులు చేయ డం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చ్యలకు పాల్పడితే చట్ట పరమైన చ్యలు ఉంటాయన్నారు.

kumaram bheem asifabad- చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తిగత దాడులకు పాల్పడడం చట్ట రీత్యా నేరమని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గోరక్షణ కమిటీ సభ్యులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోక్షకుల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడులు చేయ డం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చ్యలకు పాల్పడితే చట్ట పరమైన చ్యలు ఉంటాయన్నారు. పశువుల అక్రమ రవాణా గమనిస్తే వెంటనే 8712670505, 8712670557ల ఏదా స్థానిక పోలీసులకు, డయల్‌ 100కు సమాచారం అందించి సహకరించాలన్నారు. ఇప్పటికే జిల్లా సరిహద్దుల్లో 14 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవులు, దూడలు అక్రమ రవాణా, అమ్మకం లేదా వధకు వ్యతిరేకంగా సంబంధిత అధికారుల కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. చట్ట పరమైన ప్రమాణాలకు అనుగుణంగా జంతువుల కదిలికలను పర్యవేక్షించడానికి అధికారులు మూడు షిప్టులలో చెక్‌ పాయింట్‌లను ఏఆ్పటు చేశామని, ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్‌ బ్రాంచి ఇన్స్‌పెక్టర్‌ సతీష్‌ పాల్గొన్నారు.

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టొద్దు

సోషల్‌ మీడియా వేదికలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ తదితర మాధ్యమాలలో వ్యక్తిగతంగా గానీ, కుట్ర పూరితంగా గానీ ఉద్దేశపూర్వకంగా వ్యక్తులను, వర్గాలను లేదా సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, అవమానకరమైన పోస్టులు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం, స్టేటస్‌లలో పెట్టడం వంటి చర్యలు చట్ట రీత్యా నేరమని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కొంత మంది సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఇటువంటి చర్యల వల్ల శాంతి బద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే సైబర్‌ నేరాలకు సంబంధించిన చట్టాల ప్రకారం నిందిఉతలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అసభ్యకర లేదా విద్వేషపూరిత పోస్టులు గమనించి వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

Updated Date - May 14 , 2026 | 10:48 PM