Share News

లక్ష్యం నెరవేరే వరకు ప్రయత్నం ఆపొద్దు

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:32 PM

ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికే షన్లను అందిపుచ్చుకొని లక్ష్యం నెరవేరే వరకు నిరుత్సాహపడకుం డా నిరంతరం ప్రయత్నం చే స్తూనే ఉండా లని నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.

లక్ష్యం నెరవేరే వరకు ప్రయత్నం ఆపొద్దు
మాట్లాడుతున్న నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌

- నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌

కొల్లాపూర్‌/ పెద్దకొత్తపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికే షన్లను అందిపుచ్చుకొని లక్ష్యం నెరవేరే వరకు నిరుత్సాహపడకుం డా నిరంతరం ప్రయత్నం చే స్తూనే ఉండా లని నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. కొల్లా పూర్‌ నియోజకవర్గ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రత్నగిరి ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో శౌర్య పోలీస్‌ అకాడమీ సహకారంతో కొ ల్లాపూర్‌ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ శిక్షణ కార్యక్రమాన్ని గురు వారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాల నిరుద్యోగ యువతకు హై దరాబాద్‌కు చెందిన నిష్ణాతులైన అధ్యాపకుల తో శిక్షణ అందించడం గొప్ప విషయమని అ న్నారు. రత్నగిరి ఫౌండేషన్‌ నిర్వాహకులను ఆయన అభినందించారు. రత్నగిరి ఫౌండేషన్‌ కన్వీనర్‌ కేతూరి ధర్మతేజ మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలోని రత్నగిరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో శౌర్య అకాడమీ డైరెక్టర్‌ రంగినేని నరేష్‌, రత్న గిరి ఫౌండేషన్‌ సభ్యులు సాయిచరణ్‌, సురేష్‌, నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు.

పెద్దకొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ను గురువారం నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బి.శ్రీనివాస్‌యాదవ్‌ వార్షి క తనిఖీలో భాగంగా పరిశీలించారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరిం చారు. డీఎస్పీకి సీఐ శంకర్‌నాయక్‌, ఎస్‌ఐ వి.సతీష్‌లు బొకేలు అందజేసి స్వాగతం పలి కారు. ఏఎస్‌ఐ వసురంనాయక్‌ గౌరవ వందనం చేశారు. వివిధ అంశాలపై పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ పరిశీలించారు.

Updated Date - Oct 08 , 2026 | 11:32 PM