Share News

పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:02 PM

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహ ణపై నిర్లక్ష్యం చేయరాదని బెల్లంపల్లి డీఎల్‌పీవో కొమ్మెర సతీష్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని పెద్దపేట, లక్ష్మీపూర్‌ గ్రా మాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు.

పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు
పెద్దపేటలో వాటర్‌ ట్యాంకు వద్ద పనులు పరిశీలిస్తున్న డీఎల్‌పీఓ

భీమిని, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహ ణపై నిర్లక్ష్యం చేయరాదని బెల్లంపల్లి డీఎల్‌పీవో కొమ్మెర సతీష్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని పెద్దపేట, లక్ష్మీపూర్‌ గ్రా మాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్యం సక్రమం గా అమలయితేనే ప్రజల ఆరోగ్యంగా ఉంటారన్నారు. పారిశుధ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తడి పొడి చెత్తను వేరు చేసి ఇంటి వద్దకు వచ్చే చెత్త వాహనంలో వేసే విధంగా గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ సోక్‌ పీట్స్‌ నిర్మించేలా పోత్సహించాలని సూచిం చారు. సెగ్రిగేషన్‌ షెడ్స్‌ నిర్మాణాలకు మరమ్మత్తులు చేపట్టాలని ఆ దేశించారు. చెడిపోయిన చేతిపంపులు, బోర్లకు వెంటదివెంటనే మర్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీవో మహేష్‌, లక్ష్మీపూర్‌ సర్పంచు చంద్రగిరి దుర్గుబా యి, కార్యదర్శులు అజయ్‌, ఉబేద్‌ ఉన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 11:02 PM