Share News

పొరపాట్లకు తావివ్వొద్దు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:18 PM

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కు ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియలో పొ రపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ రిటర్నింట్‌ అధికారు లను ఆదేశించారు.

పొరపాట్లకు తావివ్వొద్దు
మునిసిపల్‌ కార్యాలయంలో అభ్యర్థులు వేసిననామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ల

- నిబంధనల ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలి

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కు ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియలో పొ రపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ రిటర్నింట్‌ అధికారు లను ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులను అభ్యర్థుల పేర్లలోని తెలుగు అక్షరమాల క్రమానుసారంగా కేటాయించాలని సూచించారు. మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభ్యర్థుల పేర్ల ఆధారంగా తెలుగు అక్ష రమాల క్రమంలో తయారు చేసిన జాబితాల ను నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వివి ధ రాజకీయ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు ని బంధనల ప్రకారం గుర్తులు కేటాయించాలని స్పష్టం చేశారు. నామినేషన్‌ ఉప సంహరణ, గు ర్తుల కేటాయింపుపై అధికా రులకు కలెక్టర్‌ పలు సూచ నలు చేశారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో సురేష్‌, మునిసిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, తహ సీల్దార్‌ తబితారాణి, వివిధ వార్డుల రిటర్నింగ్‌ అధికా రులు పాల్గొన్నారు.

ర్యాండమైజేషన్‌ పూర్తి

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యం లో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూ ర్‌ మునిసి పాలిటీలకు జరగుతున్న ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూ ర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. మంగళవారం కలె క్టరేట్‌లోని ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవ సహా యంతో కలిసి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహిం చారు. జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి మునిసిపాలిటీలలో 1,321 పోలింగ్‌ కేంద్రాలకు గాను 159మంది ప్రిసైడింగ్‌ అధికా రులు, 159మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికా రులు, 474 మంది ఇతర పోలింగ్‌ అధికారులను కేటాయించామని తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేం ద్రానికి నలుగురు సిబ్బందిని నియ మించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారులు, డీఈవో రమేష్‌కుమార్‌, సీతారాం నాయక్‌, సింహా పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:19 PM