Share News

చిన్న పొరపాటూ జరగొద్దు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:31 PM

ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామిని దర్శిం చుకునేందుకు ఈ నెల 4వ తేదీన వస్తున్నారని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

చిన్న పొరపాటూ జరగొద్దు
ఊర్కొండపేటలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీపాటిల్‌తో చర్చిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం

ఊర్కొండ, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామిని దర్శిం చుకునేందుకు ఈ నెల 4వ తేదీన వస్తున్నారని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. గు రువారం మండలంలోని ఊర్కొండపేట అభ యాంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ పను లను ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ముఖ్యమంత్రి హె లిప్యాడ్‌ నుంచి ఆలయానికి ప్రయాణించే మా ర్గం భద్రత ఏర్పాట్లు, ప్రజల రాకాపోకలకు అం తరాయం లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధి కారులతో చర్చించారు. అనంతరం ఆలయం చై ర్మన్‌ చింతల మనోహర్‌రెడ్డి కార్యనిర్వహణా ధికారి సత్యచంద్రారెడ్డి స్థానిక సర్పంచ్‌ అబ్దుల్‌ రషీద్‌ అర్చకులతో ముఖ్యమంత్రి నిర్వహించే ప్ర త్యేక పూజలు, ప్రదక్షిణ లు, పూర్ణకుంభ స్వాగతం, దర్శన ఏర్పాట్లపై సమ గ్రంగా చర్చించారు. ఆల యంలో ఆధ్యాత్మిక కార్యక్ర మాలు సంప్రదాయబద్ధం గా ఎలాంటి ఇబ్బందుల్లే కుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేయాలని సూచించా రు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వె లుపల ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ముఖ్య మంత్రి కొంతమంది ప్రముఖులతో కలిసి మధ్యా హ్న భోజనంలో పాల్గొననున్న నేపథ్యంలో అక్క డ భద్రత ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

మండల కేంద్రంలోని రైతువేదికలో అధికారు లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్‌ మాట్లాడారు. సీఎం పర్యటన విజయవంతం చే యాల్సిన బాధ్యత ప్రతీ అధికారిపై ఉందని, శా ఖల మధ్య సమన్వయంతో అప్పగించిన పనులు పూర్తి చేయడంతో పాటు విధి నిర్వహణలో అ లసత్వం లేకుండా జాగ్రత్తగా వ్యవహరిం చాలని ఆదేశించారు. ప్రతీ చిన్న అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగ ణించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణరెడ్డి, అదనపు ఎస్పీ వెంక టేశ్వర్లు ఆర్డీవో జనార్ద న్‌రెడ్డి, డీఎస్సీ వెంకట్‌రెడ్డి సీఐ భీమ్‌కుమార్‌, తహసీల్దార్‌ యూసుఫ్‌అలీ, ఎస్‌ఐ రమాదేవి జిల్లా, మండల అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:31 PM