లోటుపాట్లకు తావుండొద్దు
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:33 PM
సీఎం పర్యటన ఏర్పాట్లలో లోటుపాట్లకు తా వివ్వొద్దని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అధికా రులకు సూచించారు.
- సీఎం సభ విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలి
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సీఎం పర్యటన ఏర్పాట్లలో లోటుపాట్లకు తా వివ్వొద్దని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అధికా రులకు సూచించారు. అచ్చంపేట నియోజకవ ర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 26వ తేదీన పర్యటించనున్న సందర్భంగా ఆయన మంగళవారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పా టిల్, ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా అధికా రులతో కలిసి ఏర్పాట్లును పరిశీలించారు. ముం దుగా మద్దిమడుగు ఆంజనేయస్వామిని దర్శిం చుకున్నారు. అనంతరం మద్దిమడుగులో ముఖ్య మంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ పరిసరాల్లో భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాల ను పరిశీలించారు. సంబంధి త శాఖల అధికారులు సమ న్వయంతో పని చేసి అవసర మైన ఏర్పాట్లను పూర్తి చేయా లని ఆదేశించారు. అనంతరం మద్దిమడుగు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ కార్యాలయంలో ఎమ్మె ల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి వివి ధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ను విజయవంతం చేసేందుకు ప్రతీ శాఖ అధి కారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎ మ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి 5వేలకు పైగా గిరి జనులు సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించా లని సూచించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ జనార్దన్, అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చం పేట డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.