Share News

kumaram bheem asifabad- తాగునీటికి ఇబ్బందులు రానీయొద్దు

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:27 PM

వేసవికాలం దృష్ట్యా మారుమూల గ్రామాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్‌ భగీరథ జిల్లా కార్యాలయం, పంచాయతీరాజ్‌ కార్యాలయాలను సోమవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించారు

kumaram bheem asifabad- తాగునీటికి ఇబ్బందులు రానీయొద్దు
మిషన్‌ భగీరథ కార్యాలయంలో రిజిస్టర్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): వేసవికాలం దృష్ట్యా మారుమూల గ్రామాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్‌ భగీరథ జిల్లా కార్యాలయం, పంచాయతీరాజ్‌ కార్యాలయాలను సోమవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు మేలైన సేవలు అందించా లన్నారు. వేసవికాలం దృష్ట్యా మారుమూల గ్రామాల ప్రజలకు మిషన్‌ భగీరథ నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైన నీటి సరఫరాలో జాప్యం జరిగితే వెంటనే ఇంజనీరింగ్‌ అధికారులు మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. నీటి సరఫరా కాని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఈఈ సిద్దిక్‌ తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా బాటసారులు, ప్రజల ప్రయోజనార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్‌ అసుపత్రి లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సంధర్బంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు, రోగులకు చలివేంద్రం ద్వారా శుద్ధ జలాన్ని అందించి ప్రజల దాహారి తీర్చాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎరియాలో సంబంధిత అధికారులు చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ ప్రవీణ్‌తో పాటు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎన్యుమరేటర్లు అవగాహన కలిగి ఉండాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఎన్యుమరేటర్లు, సూపరువైజర్లు ఇళ్ల గణన ప్రక్రియలో భాగంగా ప్రతి ఆంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన జనా గణన మొదటి విడత ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎన్యుమరేటర్లు, సూపర్‌వైపర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ జనాభ గణన 2027లో భాగంగా మొదటి విడత మే 11 నుంచి జిల్లాలో ఇళ్ల గణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇళ్ల గణన ప్రక్రియలో భాగంగా ఇంటి యాజమాని నుంచి తీసుకొవాల్సిన వివరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపరువైజర్లు, ట్రైనర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 11:27 PM