Share News

చిన్నారులకు వాహనాలు ఇవ్వొద్దు

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:36 PM

మైనార్టీ తీరక ముందే పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు కారణమవు తున్నారని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు.

చిన్నారులకు వాహనాలు ఇవ్వొద్దు
అమ్రాబాద్‌లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు

- అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు

అమ్రాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : మైనార్టీ తీరక ముందే పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు కారణమవు తున్నారని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. రోడ్డు భ ద్రత వారోత్సవాల్లో భాగంగా అ మ్రాబాద్‌లోని అమరేశ్వర ఆల య ఆవరణలో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనా లు నడపడం వల్ల కూడా అనేక ప్రమాదాలకు గురవుతారని డీఎస్పీ అన్నారు. కార్యక్రమంలో సీఐ శంకర్‌నాయక్‌, ఎస్‌ఐ గిరి మనోహర్‌రెడ్డి, ఎంపీడీవో లింగయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ రా ములునాయక్‌, అచ్చంపేట వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాసమల్ల వెంకటయ్య, అమ్రాబాద్‌ సర్పంచ్‌ చిగుళ్ల కోటయ్య, ఉప సర్పంచ్‌ రాజారాంగౌడ్‌, గ్రామ పంచాయతీ అ ధికారి గౌస్‌, వివిధ పార్టీలు, సంఘాల నాయ కులు నాసరయ్య, శ్రీనివాసులు, సత్యనారాయణ, టి.మల్లేష్‌, రాజారాం, బాలకిష్టయ్య, వెంకటేశ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ బల్మూరు, (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా వాహన దారులకు, ప్రజలకు ఎస్‌ఐ రాజేందర్‌ అవగా హన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ తెలిపారు. తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీ వో రాఘవులు, గ్రామ సర్పంచ్‌ శిరీష, ఉపాధ్యా యులు, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఫ తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : ప్రజలు భయంతో కాకుండా బాధ్యతతో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని ఎస్‌ఐ నరేష్‌ అన్నారు. శనివారం అర్రైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా పెద్దూర్‌ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్‌ సేఫ్టీ అంటే కేవలం నియమాలు కాదని, జీవితాల రక్షణ అని అన్నారు. ఒక క్షణం ప్రమాదం-జీవితకాల బాధ అని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం ప్రధాన ప్రమాద కారణాలని అభిప్రా యపడ్డారు. హైల్మెట్‌, సీట్‌ బెల్టె తప్ప నిసరిగా ధరించాలని, ఇవే ప్రాణరక్షకాలు అని పేర్కొ న్నారు. మొబైల్‌ ఫోన్లలో మాట్లాడుతూ వాహ నం నడపడం ప్రమాదకరమని, రోడ్డు ప్రమా దం ఒక కుటుంబాన్ని రోడ్డున పడే స్తుందని హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రజలందరి బా ధ్యత అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పోలీస్‌ సిబ్బంది రేణయ్య, గౌతమ్‌, వెంకటేష్‌, శ్రీనివాసులు, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:37 PM