రోడ్డు భద్రతలో రాజీ పడవద్దు
ABN , Publish Date - Jan 17 , 2026 | 10:32 PM
రోడ్డు భద్రతలో వాహనదారు లు రాజీ పడవద్దని శ్రీరాంపూర్ సీఐ శ్రీలత పిలుపునిచ్చారు. సింగరేణి వీ టీసీలో రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కల్పించారు.
శ్రీరాంపూర్ సీఐ శ్రీలత
శ్రీరాంపూర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రతలో వాహనదారు లు రాజీ పడవద్దని శ్రీరాంపూర్ సీఐ శ్రీలత పిలుపునిచ్చారు. సింగరేణి వీ టీసీలో రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ప్రస్తుత కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అతి పెద్ద సమస్యగా మారాయన్నారు. దీనికి కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమేనని తెలిపారు. ప్రభుత్వాలు, అధి కారులు ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అయినా ప్రమాదాలకు చెక్ పెట్టలేకపోతున్నామని, వాహనదారుల్లో అవగాహన ఉంటే జీరో ప్ర మాదాల దిశగా పయణించవచ్చని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపవద్దన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.