గో రక్షణ పేరుతో హింసకు పాల్పడవద్దు
ABN , Publish Date - May 07 , 2026 | 01:01 AM
రక్షకుల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడు లు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్య లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా స్పష్టం చేశారు. మతపర మైన భావోద్వేగాలను
కోల్‌సిటీ, మే 6(ఆంధ్రజ్యోతి): గో రక్షకుల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడు లు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్య లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా స్పష్టం చేశారు. మతపర మైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలి గించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. బుధవారం కమిషనరేట్‌లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్, హిందువాహిణి, శ్రీరాంసేన, హిందూ యువ వాహిని సభ్యులతో పశువుల అక్రమ రవాణా నిరోధంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు చట్టపరమైన నిబంధనలు, పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కమిషరేట్ పరిధిలోని కంట్రోల్ రూమ్ 8712656597, డయల్ 100, సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషన్ డీసీపీ(అడ్మిన్) కే శ్రీనివాస్, ఎస్‌బీ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ భీమేష్, తాండూ రు సీఐ దేవయ్య, ఆర్‌ఐ పెద్దన్న, రమేష్ పాల్గొన్నారు.