Share News

రైతులకు ఇబ్బందులు కలుగొద్దు

ABN , Publish Date - May 23 , 2026 | 11:28 PM

రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పేర్కొన్నారు. శని వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమా వేశం నిర్వహించారు.

రైతులకు ఇబ్బందులు కలుగొద్దు

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌

బెల్లంపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పేర్కొన్నారు. శని వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంల ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్ధవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ పంటను విక్రయించుకునే సమయంలో ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందని, ఈ ప్రక్రియ పారదర్శకంగా వేగవంతగా కొనసాగించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేసినా సహించబోమని, రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అసవరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సబ్‌ కలెక్టర్‌మనోజ్‌కుమార్‌, తహసీల్దార్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:28 PM