Share News

kumaram bheem asifabad- వరి కొయ్యలు కాల్చొద్దు

ABN , Publish Date - May 25 , 2026 | 10:13 PM

వరి కోతలు పూర్తి కాగానే మిగిలిన వరి కొయ్యలను కాల్చడం రైతులకు ఆనవాయితీగా మా రింది. వాటిని కాల్చడం వల్ల భూసారం దెబ్బతిన్నడ మే గాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా రైతులు అదేపనిగా వరి కొయ్యలను కాలుస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల గాలికి, ఎండ తీవ్రతకు మంటలు అదుపులోకి రాక పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

kumaram bheem asifabad- వరి కొయ్యలు కాల్చొద్దు
లోగో

- కొయ్యలకు నిప్పు పెట్టడంతో అగ్నిప్రమాదాలు

- అవగాహన కల్పించకుంటే మరింత నష్టం

బెజ్జూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): వరి కోతలు పూర్తి కాగానే మిగిలిన వరి కొయ్యలను కాల్చడం రైతులకు ఆనవాయితీగా మా రింది. వాటిని కాల్చడం వల్ల భూసారం దెబ్బతిన్నడ మే గాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా రైతులు అదేపనిగా వరి కొయ్యలను కాలుస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల గాలికి, ఎండ తీవ్రతకు మంటలు అదుపులోకి రాక పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.వరి కొయ్యలను పొలంలో కలియదున్నితే పంటకు మేలు జరుగుతుంది. కానీ కొందరు రైతులు వాటిని మడిలోనే తగులబెట్టి, వచ్చే పంటకు చేజేతులా ఉరి వేసుకుంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు రైతులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో అవి 25నుంచి 30సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దీంతో మిగిలిన గడ్డి కొయ్యకాళ్ల రూపంలో ఉండిపోతోంది. దీన్ని తొలగించుకునే క్రమంలో రైతులు మడిలోనే తగులబెడుతున్నారు. ఇది పర్యావరణ కాలుష్యానికి దారితీస్తోంది. తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టుగా, ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమే కాకుండా అన్నదాత అన్ని విధాలుగా నష్టపోతున్నాడు. భూసారం తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు పశువుల కోసం గడ్డిని ఆదా చేసేవారు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గడంతో వరిగడ్డి వ్యర్థంగా మారింది. పంటల మద్య సమయం తక్కువగా ఉండటం, కొయ్యకాళ్లను తగులబెడితే కీటకాలు, వ్యాదికారక జీవులు నశిస్తాయనే అపోహతో చాలామంది రైతులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

- దున్నితేనే బలం..

వాతావరణ కాలుష్యం పెరిగి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేలలోనే పోషక విలువలు నశించి పంటకు మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. దీనివల్ల రైతులు వేసే రసాయన ఎరువులు మొక్కలకు అందే అవకాశం ఉండదు. నేలలోని సేంద్రీయ కర్బనం కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారి గాలిలో కలుస్తుంది. పొలంలో ఉండే ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు వంటి జీవరాసులు మరణిస్తున్నాయి. వరి పంట కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగులబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దున్నడం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. టనుంన వరి గడ్డి కావాలంటే ఆ వరి పెరుగుదలకు 19.9కిలోల పొటాషియం, 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. కొచ్చకాళ్లను కలియదున్నితే గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50కిలోల సూపర్‌ పాస్పేట్‌ వేస్తే నేలలో మిగిలిపోయిన వరి కొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంపై ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా పలువురు రైతులు పట్టించుకోకుండా వరికొయ్యలను కాలుస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం..

- నాగరాజు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు

వరికొయ్యలను తగులబెట్టకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వానాకాలం పం టల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రైతువేదికల్లో అవగాహన చేపడుతున్నాం. ఈ విషయంలో ఏఈవోలను అప్రమత్తం చేస్తున్నాం. వరికొయ్యలను తగులబెట్టడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నాం. రైతులు ఆచరణలో మార్పు తెచ్చుకోవాలి.

Updated Date - May 25 , 2026 | 10:13 PM