Share News

కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:28 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే మన ప్రి యతమ నేత కేసీఆర్‌ చెప్పారని, నేడు అ దే నిజమైందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు

- మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

కొల్లాపూర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే మన ప్రి యతమ నేత కేసీఆర్‌ చెప్పారని, నేడు అ దే నిజమైందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గుర్తు చేశారు. మండలం లోని మొలచింతలపల్లి గ్రామంలో బీఆర్‌ ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవా రం నిర్వహించారు. బీరం మాట్లాడుతూ పా ర్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాలపై కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవ రణ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు ప్రతిష్టా త్మకంగా తీసుకొని, గ్రామంలో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ రెండు న్నరేళ్ల కాలంలో మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టి రైతులను రోడ్డున పడేసిన ఘనత ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని మండిప డ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత ఉం దని, షాపుల్లో యూరియా దొరకడం లేదని పే ర్కొన్నారు. జిల్దార్‌ తిప్ప లిఫ్ట్‌తోపాటు ప్రాజెక్టు లను పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశా రు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్‌, మాజీ ప్ర జాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:28 PM