Share News

హాస్టల్‌ పిల్లల పొట్ట కొట్టొద్దు

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:36 PM

హాస్టల్‌ విద్యార్థుల పొట్ట కొట్టకూడదని ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల అన్నారు.

హాస్టల్‌ పిల్లల పొట్ట కొట్టొద్దు
ఎస్సీ-బీ హాస్టల్‌లో పలుచని దొండకాయ కూరను పరిశీలిస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల

- మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రత్నమాల

కల్వకుర్తి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : హాస్టల్‌ విద్యార్థుల పొట్ట కొట్టకూడదని ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ పాటిం చకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. క ల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ-ఏ, ఎస్సీ-బీ వసతి గృహాలను మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కు మార్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షానవాజ్‌ఖాన్‌ లతో కలిసి ఆమె తనిఖీ చేశారు. మెనూ పాటిం చకపోవడం, విద్యార్థుల హాజరులో వ్యత్యాసం ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ-బీ హాస్టల్లో దొండకాయ కూర పలుచగా ఉండడంతో, ఇలాంటి కూరలు విద్యార్థులు ఎలా తింటారని ప్రశ్నించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

Updated Date - Sep 16 , 2026 | 11:36 PM