అధైర్య పడకండి...అండగా ఉంటాం..
ABN , Publish Date - Apr 06 , 2026 | 10:39 PM
అధైర్య పడకండి అండగా ఉంటా మని చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వారితో సమా వేశ మయ్యారు.
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపిన పోలీసులు
కోటపల్లి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : అధైర్య పడకండి అండగా ఉంటా మని చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వారితో సమా వేశ మయ్యారు. విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపడానికి, పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచే దిశగా పోలీసుల ఉన్నతాధికారుల సూచనల మేరకు సీఐ కృష్ణ, ఎస్‌ఐ రాజశేఖర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విద్యార్థినులు ధై ర్యంగా ఉండాలని ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. విద్యార్థులు భవి ష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని క్రమ శిక్షణతో చదవాలని, ముఖ్యంగా పరీ క్షల ఫలితాల సమయంలో ఎలాంటి ఆందోళనలకు గురై కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ఓటమిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ముం దడుగు వేయాలని సూచించారు. మహిళా కానిస్టేబుళ్ల ఆధ్వర్యంలో పోలీసు భరోసా అందుబాటులో ఉంటుందని, విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఆదపలో ఉన్నా తక్షణమే పోలీసులను సంప్రదించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజన సౌకర్యాలను పరిశీలించి వారితో క లిసి భోజనం చేశారు. తర్వాత విద్యార్థినీలకు పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చే శారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజశేఖర్, హెచ్‌ఎం మధు నయ్య, మహిళ కానిస్టేబుళ్లు మౌనిక, దీక్షిత, విద్యార్థులు పాల్గొన్నారు.