Share News

kumaram bheem asifabad- నిరుత్సాహం వద్దు

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:40 PM

ఇంటర్‌ ఫలితాలు వచ్చిన ప్రతీ సారి కొందరు విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగితుంటే.. మరి కొందరు నిరాశ లో మునిగిపోతుంటారు. ఇంకొందరు పరీక్ష తప్పగా నే నా జీవితం ఇంతటితో అంత మైంది అని బాధప డుతూ ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతుంటారు. ఒక్క పరీక్ష ఫలితంతోనే తమ భవిషత్తు ముగిసి పోయిందని భావించడం బాధాకరం. పరీక్ష ఫలిత మే జీవితం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.

kumaram bheem asifabad- నిరుత్సాహం వద్దు
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

- ఫెయిల్యూర్‌ ఒక పాఠం..విజయానికి దారి చూపే మార్గం

- ధైర్యంగా మళ్లీ ప్రయత్నిస్తే గెలుపు మీదే

వాంకిడి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాలు వచ్చిన ప్రతీ సారి కొందరు విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగితుంటే.. మరి కొందరు నిరాశ లో మునిగిపోతుంటారు. ఇంకొందరు పరీక్ష తప్పగా నే నా జీవితం ఇంతటితో అంత మైంది అని బాధప డుతూ ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతుంటారు. ఒక్క పరీక్ష ఫలితంతోనే తమ భవిషత్తు ముగిసి పోయిందని భావించడం బాధాకరం. పరీక్ష ఫలిత మే జీవితం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఓడిపోవడం ఒక పాఠమని. విజయానికి దారితీసే మార్గమని మరవొద్దు. ప్రపంచంలో ఎందరో గొప్ప వ్యక్తులు కూడా మొదట్లో వైఫల్యా లను ఎదర్కొన్న తర్వాతే విజయాన్ని సాధించారనేది తెలుసుకుని ముందుకు సాగాలి. పరీక్షలో విఫలం అంటే జీవితం విపలం కాదని తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ సమయంలో విద్యార్థులకు మానసిక బలాన్ని ఇవ్వాలి. ఫెయిల్‌ అయ్యావ్‌ అని మందలించకుం డా మళ్లీ ప్రయత్నిద్దాం అనే నమ్మకాన్ని నింపాలి.

- ఓటమి చెందిన వారే..

పరీక్షలు మనజ్ఞానాన్ని కొంతవరకే కొలుస్తాయి. అవి మన సృజనాత్మకత, మనో ధైర్యం, పట్టుదల జీవితంపై అవగాహన వంటి ముఖ్యమైన లక్షణా లను కొలవలేవు. ఈ ప్రపంచంలో ఎంతోమంది విజయవంతమైన వ్యక్తులు కూడా తమ జీవితంలో ఒక దశలో విఫలమయ్యారు. కానీ వారు ఆ వైఫ ల్యాన్ని ముగింపుగా భావించలేదు. కొత్త అవకా శంగా తీసుకున్నారు. అదే వారిని గొప్పవారిగా మారుస్తుందని విద్యావంతులు చెబుతున్నారు. మొదట ఫెయిల్‌ అవడం జీవితాన్ని నిర్ణయించదని చెప్పడానికి ప్రపంచంలో ఎన్నో నిజమైన ఉదాహరణలు ఉన్నాయి. మొదట్లో విఫలమై తర్వాత అసాధారణ విజయాలను సాధించిన కొందరి ప్రముఖులు నిజజీవితం కథనాలు ఇలా ఉన్నాయి. బారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం తన కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న తర్వాత భారతదేశానికి మిసైల్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఒక లక్ష్యం చేజారితే మరో గొప్ప లక్ష్యం మన కోసం ఉంటుందని నిరూపించారు. ఐన్‌స్టిన్‌ చదువు కొన్ని పరీక్షల్లో విఫల మైనా తన ఆసక్తి ఆలోచనా శక్తితో ప్రపంచానికి ధీయరీ ఆఫ్‌ రియాలెటివిటి వంటి గొప్ప సిద్ధాం తాన్ని అందించారు. విద్యుత్‌ దీపాన్ని అవిష్కరించిన థామస్‌ ఎడిసన్‌ను టీచర్లు ఈ విద్యార్థి నేర్చుకో లేదని చెప్పినా ఆయన ఎన్నోప్రయత్నాలు విఫలమైన తర్వాతే విజయం సాధించారు. ఇలా ఎన్నో కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులు, సరైన గైడె న్స్‌ లేక అనారోగ్యం తదితర కారణాలతో పరీక్షల్లో ఫైయిల్‌ అవుతూ ఉంటారు. అంతమాత్రాన జీవి తంలో మరో ముందడుగు లేదనేది మర్చిపోవద్దు.

- విద్యార్థుల్లో కలిగే భావోద్వేగాలు..

ఫలితాల్లో ఫెయిల్‌ అయినప్పుడు విద్యార్థుల్లో పలు రకాల భావోద్వేగాలు ఉత్పన్నమవుతాయి. ఇక నా వల్ల కాదు అనే ఆత్మవిశ్వాసం కోల్పోవడం, తల్లిదం డ్రులు, సమాజా న్ని ఎలా ఎదుక్కొవాలనే భయం, ఇతరులతో పోల్చుకొని తమను తాము తక్కువ చేసుకోవడం లాంటి ఈ భావాలు సహజం గానే ఉంటాయి. ఇవి తాత్కాలికం మాత్రమేనని గుర్తించాలి. ఇవి మీ అసలు విలువను నిర్ణయిం చవు. ఒకరి ఫెయిల్యూర్‌ను నిందించడం, హేళన చేసి మాట్లాడడం కొందరిలో సహజంగానే ఉంటుం ది. అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ఎవరి సామర్ధ్యం వారికి తెలు సే ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది. టైమ్‌ మేనేజ్‌ మెంట్‌ లోపమా... పరీక్షల సమయంలో ఒత్తిడి ఎక్కువైందా.. విశ్లేషించండి. మరోమారు ప్రయ త్నించి విజయం సాధించాలి. విద్యార్థులు ఓటమి అనే ప దాన్ని నెగెటివ్‌గా చూడడం మానుకుని కొత్త ప్రణాళికతో ముందుకు సాగితే విజ యాన్ని సాధించ వచ్చని విద్యావంతులు చెబుతున్నారు. ఫలితాలు వచ్చిన సమయంలో తమబిడ్డ అనుకున్న మేర ఫలితాలు సాధించకపోయినా, ఫెయిలైనా తల్లిదండ్రులు సహనం పాటించాలి. ఫలితాలు తెలియగానే మందలించడం, ఒత్తిడి చేయడంతో విద్యార్థుల్లో నిరాశ పెరుగుతుంది. ఈ పరీక్ష కాకపోతే మరో పరీక్ష రాయోచ్చని ప్రోత్సహిం చడం వారికి మానసిక బలాన్ని ఇస్తుంది. జరిగిన లోప ంపై తమ బిడ్డలతో కూర్చుని చర్చించాలి. సీనియర్‌ విద్యార్థులు, లేదంటే అధ్యాపకులతో సలహాలు ఇప్పించాలి.

నెగిటివ్‌గా చూడడం మానుకోవాలి..

- వడ్లూరి రాజేష్‌, మోటివేషనల్‌ స్పీకర్‌

ఓటమి అనే పదాన్ని నెగెటీవ్‌గా చూడడం మానుకోవాలి. విద్యార్థులు తమ తప్పులను విశ్లేషిం చి కొత్త ప్రణాళికతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చు. పరీక్షలే జీవితం కాదనేది తల్లిదం డ్రులు, అధ్యాపకులు విద్యార్థికి వివరించి చెప్పాలి. ఒకవేళ విద్యార్థి కుంగిపోతే మానసిక వైద్యుడి సలహా తీసుకునేలా చూడాలి.

Updated Date - Apr 17 , 2026 | 10:40 PM