Share News

దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:26 PM

ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద మెరిట్‌ విద్యార్థులను వర దాత సిగ్మా అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ మేనే జింగ్‌ డైరెక్టర్‌ చీమర్ల దామోదర్‌రెడ్డి అందిస్తున్న నగదు ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకో వాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్‌, సీఎల్‌ఆర్‌ విద్యాసంస్థ కరస్పాండెంట్‌ ఉంద్యాల రాజమహేందర్‌రెడ్డి అన్నారు.

దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కారువంగ జడ్పీహెచ్‌ పాఠశాలలో మెరిట్‌ విద్యార్థులకు 3 నెలల నగదు పురస్కారం అందజేస్తున్న డీఈఓ రమేశ్‌

- జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ కుమార్‌

తెలకపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యో తి) : ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద మెరిట్‌ విద్యార్థులను వర దాత సిగ్మా అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ మేనే జింగ్‌ డైరెక్టర్‌ చీమర్ల దామోదర్‌రెడ్డి అందిస్తున్న నగదు ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకో వాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్‌, సీఎల్‌ఆర్‌ విద్యాసంస్థ కరస్పాండెంట్‌ ఉంద్యాల రాజమహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మం డల పరిధిలోని కారువంగ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగ తి మెరిట్‌ విద్యార్థులకు 3 నెలలకు సంబంధిం చిన నగదు పురస్కారాలు అందజేశారు. వారు మాట్లాడుతూ మండలంలో అన్ని ప్రభుత్వ పా ఠశాలల్లోని మెరిట్‌ విద్యార్థులకు రూ.60,000 నగదు పురస్కారాలను అందజేసినట్లు తెలిపా రు. విద్యాదాతలు అందిస్తున్న సహకారాన్ని స ద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తు లో విద్యాపరంగా ఆర్థికంగా ఎదగాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసురెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు రాంరెడ్డి, మురళీరెడ్డి, రమేష్‌, విజయ్‌రెడ్డి, కురుమూర్తి, పీడీ వెంకటే శ్వర్లు, స్వరూప, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:26 PM