Share News

ధరణి పోర్టల్‌ రీఫండ్‌ ఊసేది...?

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:31 PM

ధరణి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ర్టేషన్లకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి వి నియోగదారులు చెల్లించిన రుసుం ఎప్పుడు తిరిగి వస్తుం దోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. మూడు నాలుగు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి చెం దిన కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి.

ధరణి పోర్టల్‌ రీఫండ్‌ ఊసేది...?

ఏళ్లు గడుస్తున్నా చేతికి అందని స్లాట్ల డబ్బులు

ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన కోట్లాది రూపాయలు

-భూ భారతి అమలు నేపథ్యంలో అయోమయం

-ఆందోళన చెందుతున్న వినియోగదారులు

మంచిర్యాల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ర్టేషన్లకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి వి నియోగదారులు చెల్లించిన రుసుం ఎప్పుడు తిరిగి వస్తుం దోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. మూడు నాలుగు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి చెం దిన కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. చివరిసారిగా 2021-22లో కొంత రీఫండ్‌ చేసినప్పటికీ స్లాట్లు రద్దు చేసు కున్న వారందరికీ పెద్ద మొత్తంలో డబ్బులు రావాల్సి ఉంది. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇచ్చేందుకు చొరవ చూపకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. గతంలో ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకొని చెల్లిం చిన డబ్బుల విషయం కొలిక్కిరాక పోవడంతో దరఖాస్తుదా రులు అయోమయంలో పడ్డారు. అసలు ధరణి డబ్బులు వ స్తాయో, రావోనన్న సందేహాలు నెలకొన్నాయి. భూ భారతి అమలులోకి వచ్చిన తరువాత ధరణి పోర్టల్‌ దాదాపుగా ని లిచిపోయింది. ఆ సమయంలో చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఒక్కో దరఖాస్తుదారుడు రూ. 25వేల నుంచి రూ. 50 వేల వరకు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న డబ్బులు కోట్లలోనే ఉంటాయని అంచనా. ఇదిలా ఉం డగా భూ సమస్యలు పరిష్కారం కాక చాలా మంది స్లాట్ల ను ఉప సంహరించుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం డబ్బు లను తిరిగి చెల్లించాల్సి ఉంది. గత ఏడాది జూన్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి అమలులోకి వచ్చింది. భూ భారతిపై ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో అధికారులు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయగా, ప్రత్యేక పోర్టల్‌ ద్వారా భూ సంబంధిత కార్యాచరణ కూడా కొనసా గుతోంది.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు...

వ్యవసాయ భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ర్టేషన్‌ కోసం ధరణి పోర్టల్‌లో చెల్లించిన రుసుం వెనక్కి ఇస్తారే మోనన్న ఆశతో వందలాది మంది వినియోగదారులు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, నాలా కన్వర్షన్‌ అనుమతులు, విరాసత్‌ కోసం పేర్ల మార్పిడి, ఇంటి రిజి స్ర్టేషన్‌లు తదితర వాటి కోసం ధరణిలో స్లాట్‌ను బుక్‌ చే సుకునేందుకు వారంతా మీ సేవా కేంద్రాల్లో నిర్దేశిత ఫీజు లను చెల్లించారు. అయినప్పటికీ వివిధ కారణాలతో స్లాట్ల ను అధికారులు రద్దు చేయడమో, లేక బుక్‌ చేసుకున్న వా రు ఆయా కారణాల వల్ల స్వయంగా విరమించుకున్న ఉ దంతాలు ఉన్నాయి. అలా రద్దు చేసుకున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించిన సొమ్మును తిరిగి వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు స్లాట్‌ సొమ్ములు తిరిగి రాలేదు. వాటి కోసం దరఖాస్తు దారులు కార్యాలయాల చు ట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకొని రద్దయిన వారికి సొమ్ము చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సంబంధిత అధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

సొమ్ము అందేది ఎప్పుడో..?

స్లాట్‌ బుక్‌ చేసుకొని ఆ తరువాత రద్దు చేసుకున్న వా రికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి చలానా డబ్బులు జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. స్లాట్‌ రుసుం, ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుండగా తిరిగి అక్కడి నుం చి రద్దు చేసుకున్న వినియోగదారులకు అందాల్సి ఉంటుం దంటున్నారు. స్లాట్‌ రద్దయిన వెంటనే సొమ్ము తిరిగి చెల్లిం చడం విషయంలో రెవెన్యూ శాఖకు సంబంధం లేదని దీని పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారు లు చెబుతున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ధర ణి పోర్టల్‌ పేరుతో అప్పటి ప్రభుత్వం ఫీజులు వసూలు చేసినప్పటికీ వివిధ కారణాల చేత స్లాట్లు రద్దు చేసుకున్న వారికి తిరిగి చెల్లించకపోవడంతో వారంతా నిలువు దోపిడికి గురయ్యారు. ఒక్కసారి ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకుం టే తప్పనిసరిగా ఆ కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉం టుంది. ఏదైనా కారణంతో రీషెడ్యూల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఆ స్లాట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు, స్టాంప్‌ డ్యూటీ విధిగా రీ ఫండ్‌ చేయాలి. ఈ విషయంలో చెల్లింపులు ఎప్పుడు జరుగుతా యో తెలియని పరిస్థితి ఉంది.

తప్పులు దొర్లితే అంతే సంగతులు...?

ధరణి పోర్టల్‌లో ఫీజు చెల్లించిన తరువాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవ డంతో ఒక్క అక్షరం తప్పు దొర్లినా సరిదిద్దే అవకాశం లేకుం డా పోయింది. దీంతో చెల్లించిన ఫీజు ఏ ఖాతాల్లోకి వెళ్లిం ది...? ఎవరిని సంప్రదించాలి? రీఫండ్‌ డబ్బులు ఇస్తారా...? అవి నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి వస్తాయా...? అసలు బ్యాంక్‌ ఖాతాలు ఎవరు అడుగుతారు? అన్న సందేహాలు ఉన్నాయి. ధరణి పోర్టల్‌ రాకముందు వ్యవస్థలో ఏదైనా పొరపాటుగా అక్షర దోషాలు ఉంటే వాటిని సవరించుకునే అవకాశాలు ఉండేవి. ధరణి పోర్టల్‌ వచ్చిన తరువాత సవరణకు అవకా శం లేకుండా పోయింది. ఒక్క చిన్న తప్పు జరిగినా స్లాట్‌ కోసం చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి వస్తుందా లేదా అన్న స్పష్టత కూడా లేదు.

మార్పులు జరిగేనా...?

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ తీసుకవచ్చి నందున కనీసం అందులోనైనా సవరణలకు అవకాశం ఉం టుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధరణి పో ర్టల్‌ కింద వసూలు చేసి, స్లాట్‌ రద్దయిన పక్షంలో సొమ్ము లు తిరిగి చెల్లించాలని గత ఏడాది డిసెంబర్‌ 13న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినప్పటికీ ఇప్పటికీ అది సంపూర్ణంగా కార్యరూపం దాల్చలేదు.

Updated Date - Apr 07 , 2026 | 11:31 PM