Share News

కొలువులో చేరిన చోటే రిటైర్మెంట్‌

ABN , Publish Date - May 31 , 2026 | 06:02 AM

ప్రభుత్వ కొలువంటే బదిలీలు సహజం. శాఖను బట్టి రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య కనీసం ఒక్కసారైనా బదిలీ అవుతుంటారు. కానీ, వైద్యారోగ్యశాఖలో కొందరు ఉద్యోగంలో చేరినచోటే దశాబ్దాలుగా .....

కొలువులో చేరిన చోటే రిటైర్మెంట్‌

  • వైద్యశాఖలో దశాబ్దాలుగా ఒకేచోట కొందరు వైద్యులు

  • 10-30 ఏళ్ల వరకు బదిలీ కాని దాదాపు 100 మంది

  • ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే.. జాబితా విడుదల

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొలువంటే బదిలీలు సహజం. శాఖను బట్టి రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య కనీసం ఒక్కసారైనా బదిలీ అవుతుంటారు. కానీ, వైద్యారోగ్యశాఖలో కొందరు ఉద్యోగంలో చేరినచోటే దశాబ్దాలుగా తిష్టవేసి అక్కడే రిటైర్‌ అవుతున్నారు. కొందరు 30 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రుల్లో రెండున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న వైద్యులు ఉన్నారు. బదిలీ అన్న మాటే లేకుండా ఇలా 10 నుంచి 30 ఏళ్లుగా ఓకేచోట పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది 100 మందికిపైగానే ఉన్నట్లు లెక్క తేలింది. వైద్యశాఖలో ప్రభుత్వం తాజాగా సాధారణ బదిలీలు చేపట్టింది. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారి వివరాలను శనివారం విడుదల చేసింది. వైద్యవిద్య సంచాలకులు (డీఎంఈ), వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ), ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌), ఆయుష్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగాల్లో నాలుగేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న వారి జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది.

హైదరాబాద్‌లోనే పోస్టింగ్‌, ఇక్కడే రిటైర్మెంట్‌

డీఎంఈ, డీహెచ్‌ పరిధిలోని కొందరు వైద్యులు దీర్ఘకాలంగా హైదరాబాద్‌లోనే ఉండిపోతున్నారు. డీఎంఈ వైద్యుల్లో కొందరు హైదరాబాద్‌లో పోస్టింగ్‌ తీసుకొని, ఇక్కడే రిటైర్‌ అవుతున్నారు. స్పౌజ్‌, సంఘాల పేరుతో ప్రతిసారీ బదిలీల నుంచి మినహాయింపు పొందుతున్నారు. అలాగే సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించిన పోస్టులు హైదరాబాద్‌ బయటి ఆస్పత్రుల్లో లేకపోవడంతో వారంతా ఇక్కడే ఉంటున్నారు. మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ లాంటి విభాగాల పోస్టులు జిల్లాల్లో లేవు. దీంతో ఆ స్పెషాలిటీలో ఉన్న వైద్యులు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. కానీ, సూపర్‌ స్పెషాలిటీతో సంబంధం లేకుండా కూడా కొందరు ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 15-25 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే పాతుకుపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒకటిరెండు చోట్ల దశాబ్దాలుగా ఒకేచోట ఉన్న వైద్యులూ ఉన్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్యుడు సందీప్‌ పవార్‌ 31 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని నిలోఫర్‌లోని ఒక పీడియాట్రిక్‌ వైద్యుడు 27.5 సంవత్సరాలుగా భాగ్యనగరం వదలి బయటకు వెళ్లలేదు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఇలా కొందరు దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే ఉండిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులకు నగరాలకు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. బదిలీల ప్రక్రియ చేపట్టిన ప్రతిసారీ తమకు హైదరాబాద్‌కు బదిలీ అవుతుందా అని జిల్లా మెడికల్‌ కాలేజీల్లోని అధ్యాపకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


20 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వైద్యులు

డాక్టర్‌ మల్లీశ్వర్‌, డాక్టర్‌ ఎన్‌.రవికుమార్‌, డాక్టర్‌ రాకేశ్‌ సహాయ్‌, డాక్టర్‌ విజయ్‌శేఖర్‌ రెడ్డి, డాక్టర్‌ వెంకటరత్నం, డాక్టర్‌ రామ్‌కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ టి.ప్రమోద్‌కుమార్‌, డాక్టర్‌ జి.రాజా భరత్‌కుమార్‌, కె.ఎం.కె.రెడ్డి, డాక్టర్‌ ఎ.కృష్ణారెడ్డి, డాక్టర్‌ గొల్లపల్లి రవీంద్ర, డాక్టర్‌ పి.ప్రవీణ్‌, డాక్టర్‌ బి.రమేశ్‌కుమార్‌, డాక్టర్‌ ఉమాదేవి, డాక్టర్‌ శ్రీరంగలక్ష్మి, డాక్టర్‌ ఎస్‌. శ్రీనివాస సత్యనారాయణ, డా. మస్తాన్‌, డా. కె.శ్రీనివాస్‌, డాక్టర్‌ మనీషా సహాయ్‌, డాక్టర్‌ ఎన్‌.భువనేశ్వరరావు, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ కేవీ సత్యనారాయణ, డా. నాగార్జున, డా. రమేశ్‌, డా. మురళీధర్‌, డాక్టర్‌ పి.రాధిక,

10 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వైద్యులు

డాక్టర్‌ ఉమాకాంత్‌ గౌడ్‌, డాక్టర్‌ మురళీధర్‌, డాక్టర్‌ కిరణ్మయి, డాక్టర్‌ వై.మంజూష, డాక్టర్‌ నీలవేణి, డాక్టర్‌ విజయ్‌మోహన్‌, డాక్టర్‌ బి.రమేశ్‌, డాక్టర్‌ రాధిక కృష్ణ, డాక్టర్‌ సయ్యద్‌ ఇమాముద్దీన్‌, డాక్టర్‌ జీ.భువనేశ్వరి, డాక్టర్‌ మురళీధర్‌, డాక్టర్‌ అనిత బైళ్ల, డాక్టర్‌ అనూరాధ, బి. వినోద్‌కుమార్‌, డాక్టర్‌ కె.సునీత , డాక్టర్‌ వెంకట అరుణవల్లి, డాక్టర్‌ సుచిత్ర, కె.అశోక్‌, ఎన్‌.బాలరాజ్‌, కోట రమేశ్‌, డాక్టర్‌ శశికాంత్‌, డాక్టర్‌ లాలూప్రసాద్‌, డాక్టర్‌ సత్యశ్రీ, డా. సత్యశ్రీ, డాక్టర్‌ శైలజ, డా.ఎన్‌.వీణ, డాక్టర్‌ ఆర్‌.రమేశ్‌.

Updated Date - May 31 , 2026 | 06:02 AM