Share News

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:45 PM

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించారు.

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌

-డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌

చెన్నూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి) :వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూవర్షాకాలం మొదలైనందున కీటక జనిత వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా, ఫైలేరియా వ్యాపించే వీలున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు కుట్టకుండా , పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలందించాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని, ఇళ్లలోని కూలర్లు, కొబ్బరిబోండాలు, కుండల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, దీనిపై ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాపిడ్‌ ఫీవర్‌ సర్వేలో భాగంగా ప్రతి రోజు 50 ఇళ్లను తనిఖీ చేసి ఇంటింటికి తిరిగి వ్యాధులను గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. బీపీ, షుగర్‌ వ్యాధులను త్వరగా గుర్తించి మందులను అందజేయాలన్నారు. అనంతరం చెన్నూరులోని ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్‌ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి తాగునీరు, దోమల నివారణ చర్యలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు సుధాకర్‌ నాయక్‌, అరుణశ్రీ, కృష్ణతేజ, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్‌, అధికారులు అల్లాడి శ్రీనివాస్‌, జగదీష్‌, వెంకటేశ్వర్లు, సత్తయ్య, నాందేవ్‌, పద్మ, వసుమతి, సూపర్‌ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:45 PM