Share News

ఒకే గడియారంలో 176 దేశాల సమయం!

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:08 AM

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు ఆర్‌ఎంపీ వైద్యుడు పున్న మల్లేశం. 176 దేశాల సమయాన్ని ఒకేచోట తెలుసుకునేలా గ్లోబు ఆకారంపై ప్రపంచ గడియారాన్ని రూపొందించారు.

ఒకే గడియారంలో 176 దేశాల సమయం!

  • ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించిన ఆర్‌ఎంపీ వైద్యుడు

హయత్‌నగర్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు ఆర్‌ఎంపీ వైద్యుడు పున్న మల్లేశం. 176 దేశాల సమయాన్ని ఒకేచోట తెలుసుకునేలా గ్లోబు ఆకారంపై ప్రపంచ గడియారాన్ని రూపొందించారు. సమయంతో పాటు పగటి, రాత్రి వేళలను తెలుసుకునేందుకు వీలుగా నీలం, ఎరుపు సర్కిళ్లలో అంకెలు ఉంచారు. మల్లేశం స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం. బీఎస్సీ, బీఈడీ చదివారు. పీజీ-డీఎన్‌డీ చేశారు. ప్రస్తుతం ఆయన హయత్‌ నగర్‌లోని లెక్చరర్స్‌ కాలనీలో నివాసం ఉంటూ ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కొత్త ఆవిష్కరణల కోసం కృషి చేస్తుంటారు. ఇంతకు ముందే కలియుగ క్యాలెండర్‌, కలియుగ పంచాంగం తయారు చేశారు. 1,200 సంవత్సరాల ఐరిష్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కొత్తగా ఆయన ప్రపంచ గడియారాన్ని తయారుచేశారు. మల్లేశం ప్రతిభకు ఇండియా, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం దక్కింది. మల్లేశం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈ ప్రపంచ గడియారం వల్ల విదేశాల్లో ఉన్న మనవారితో ఏ సమయంలో మనం మాట్లాడవచ్చునో తెలుసుకునే వీలు ఉంటుందన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 04:08 AM