kumaram bheem asifabad- 2002 ఓటరు వివరాలు కావాలా..?
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:24 PM
ప్రత్యే క ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో 2002 ఓటరు జాబితా ప్రామాణికంగా మారింది. దీని ఆధారంగానే గణన ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. అప్పటి ఓటరు జాబితా అందుబాటులో లేదు. కానీ ఆన్‌లైన్‌లో ఆ వివరాలు తెలుసుకోవచ్చు
వాంకిడి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యే క ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో 2002 ఓటరు జాబితా ప్రామాణికంగా మారింది. దీని ఆధారంగానే గణన ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. అప్పటి ఓటరు జాబితా అందుబాటులో లేదు. కానీ ఆన్‌లైన్‌లో ఆ వివరాలు తెలుసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.ఈసీఐ. గౌట్.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఓటరు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
- ఇలా చేయండి..
వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్‌ఐఆర్-2026లో కుడి వైపున ఎగువ భాగంలో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్‌ను క్లిక్ చేయాలి. దీంతో ఈసీఐనెట్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్లీ కుడిపైపు ఎగువున ఉన్న సెర్చ్ ఇన్ లాస్ట్ సర్ ఈ-రోల్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రా జాబితా నుంచి తెలంగాణ ఎంచుకోవాలి. వరుసగా అప్పటి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల వివరాలు, పోలింగ్ స్టేషన్లు వారీగా చూపిస్తుంది. వీటిలో కావాల్సిన గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఒక వేళ అక్కడ రెండు పోలింగ్ కేంద్రాలు ఉంటే మన ఓటు ఉన్న కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుపచ్చ రంగులో ఉన్న వ్యూ ఐచ్చికను క్లిక్ చేయ గానే ఆ గ్రామం పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇందులో ఇంటి నంబరు ఆధారంగా తమ పేరు పరిశీలించుకోవచ్చు. వీటిలో పోలింగ్ కేంద్రం నంబరు, వరుస సంఖ్య, సెక్షన్ నంబరు, ఇంటి నంబరు, ఓటరుపేరు, తండ్రి/భర్త, బంధువులు పేరు, అప్పటి వయస్సు, ఎపిక్ కార్డు నంబర్లు వివరాలన్నీ కనిపిస్తాయి. వీటి ఆధారంగా ప్రత్యేక ఓట రు జాబితా గణన ఫారాన్ని పూరించుకో వ చ్చు. ఈ ఫారంలో ఎగువన కుడిపైపు ఉన్న బంధువులకు సంబంధించి తండ్రి, తల్లి, తాత, నానమ్మకు సంబంధించిన వాటిని మాత్రమే రాయాలి. ఇతర బంధుత్వ వివ రాలు పూరించకూడదు. 2002 నాటికి ఓట రుగా నమోదు కాని మహిళలు తమ పుట్టిం టికి సంబంధించిన వారి వివరాలు రాయా ల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఆధారంగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.