kumaram bheem asifabad- గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు వాడొద్దు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:16 PM
గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎస్‌వో వసంతలక్ష్మి, డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి హజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించకూడదని ఈ విషయమై జిల్లా రెవెన్యూ, పౌరసరఫరాలు, మున్సిపల్ శాఖల అదికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు.
ఆసిఫాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎస్‌వో వసంతలక్ష్మి, డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి హజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించకూడదని ఈ విషయమై జిల్లా రెవెన్యూ, పౌరసరఫరాలు, మున్సిపల్ శాఖల అదికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎల్‌పీజీ, పెట్రోల్ కొరత లేదని తెలిపారు. ఎల్‌పీజీ గోదాంలు, పెట్రోల్ బంక్‌ల వద్ద స్టాక్ వివరాలను పట్టికలో ప్రదర్శించాలని, కృతిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుకింగ్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి సిలిండర్లను అందించేందుఉ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి రోజు ఎల్‌పీజీ సిలిండర్ల నిల్వలు పంపిణీ వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. విద్యా సంస్థలు, వసతి గృహలు, గురుకులాల అవసరాలకు సరిపడా సిలిండర్లు అందించాలని చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపా రులు ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగించరాదని తెలిపారు. పెట్రోల్‌బంకుల్లో పెట్రోల్‌ను ప్లాస్టిక్ క్యానులలో పోయరాదని సూచిం చారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు, పట్టణ ప్రాంతాలలో 25 రోజుల సిలిండర్ల బుకింగ్ గడువుందన్నారు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలలో వచ్చే ప్రతికూల కథనలపె స్పందించి అదే రోజు జిల్లా పౌర సంబంధాల అధికారికి రిజైండర్లను సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో రవాణా, అగ్నిమాపక, సంక్షేమశాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎల్‌పీజీ డీలర్లు, పెట్రోల్‌బంకుల యాజమానులు తదితరులు పాల్గొన్నారు.