Share News

అభివృద్ది పనులకు ఆటంకం కలిగించొద్దు

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:54 PM

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పను లకు అధికారులకు ఆటంకం కలిగించొద్దని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొ జ్జుపటేల్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో గ్రామాల అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

అభివృద్ది పనులకు ఆటంకం కలిగించొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

గ్రామాల అభివృద్దే ప్రధాన లక్ష్యం

ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌

జన్నారం, ఆగస్టు4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పను లకు అధికారులకు ఆటంకం కలిగించొద్దని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొ జ్జుపటేల్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో గ్రామాల అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అటవిశాఖ అధికారులు అతి చూపిస్తున్నారని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, అభివృద్దిలో భాగంగా నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి ఇసుకతీసుకొస్తే పట్టుకొని కేసులు పెడుతు న్నారని అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దని సమావేశానికి హాజరైన జన్నారం రేంజ్‌ అధికారి బాబాఖాదర్‌ వలీ సూచించారు. వెంటనే ఆయన స్పందిస్తూ టైగర్‌జోన్‌లో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిని పది కిలోమీటర్ల నుంచి కిలోమీటరుకు కుదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. దీంతో పేద సామాన్యులకు ఇల్లుకట్టుకవాలంటే ఇసుక భారంగా మారిందని చూ సి చూడనట్లుగా వ్యహరించాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు. మండలంలోని లోతొర్రె గ్రామానికి వెళ్లేందుకు వంతెన లేక ఇబ్బంది పడు తున్నారని ఆదివాసీల పరిస్థితి అధ్వానంగా మారిందని సర్పంచ్‌ శంకర్‌ నాయక్‌ తెలుపగా కామన్‌పల్లి సర్పంచ్‌ పేరం శ్రీనివాస్‌ కామన్‌పల్లి గ్రామంలో ఉన్న ఇరిగేషన్‌ భూములను సుమారు 30 ఎకరాలకుపై ఇరిగే షన్‌ భూమిని కబ్జా చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ సమస్య, బోరు బావుల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య ఆరోగ్యంతో పాటు అన్ని రకాల వసతులు ఎప్పటికప్పుడు అందాలని అధికారులకు సూచిం చారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివద్ది చెందుతుందని సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో ఉమర్‌షరీఫ్‌, తహసీల్దార్‌ బక్కయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మినారాయణ, ఎంఈవో రాజేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అల్లం రవితో పాటు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 10:54 PM