వన్య ప్రాణులకు హాని కలిగించవద్దు
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:13 PM
వన్య ప్రాణులకు హానీ కలిగించవద్దని నీల్వాయి ఎఫ్‌ఆర్‌వో హఫీజుద్దీన్ పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచవన్యప్రాణి దినోత్సవం సందర్భంగా కల్మలపేట, నీల్వా యి, కేతనపల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి వన్య ప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వేమనపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : వన్య ప్రాణులకు హానీ కలిగించవద్దని నీల్వాయి ఎఫ్‌ఆర్‌వో హఫీజుద్దీన్ పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచవన్యప్రాణి దినోత్సవం సందర్భంగా కల్మలపేట, నీల్వా యి, కేతనపల్లి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి వన్య ప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు అడవుల్లోకి వె ళ్లవద్దని, కాల్చిన బీడీలు, సిగరెట్లు అడవిలో పారవస్తే ఎండిన ఆకులకు అంటుకుని మంటలు చెలరేగి వన్యప్రాణులకు హానీ జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వన్యప్రాణులను హతమార్చడం కోసం ఉచ్చు లు, కరెంటు తీగలు అమర్చేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వన్య ప్రాణులకు హానీ తలపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ప్రమోద్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ మహిపాల్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.