Share News

అర్హులకు అన్యాయం చేయొద్దు

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:57 PM

కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్‌ దుకాణాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దళిత నిరుద్యోగ యువకులు చేప ట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి.

అర్హులకు అన్యాయం చేయొద్దు
రిలే దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌

- మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి, జూన్‌ 28 (ఆంరఽధజ్యో తి) : కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్‌ దుకాణాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దళిత నిరుద్యోగ యువకులు చేప ట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరా న్ని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకురాలు విజితా రెడ్డి సందర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ అర్హులైన దళిత నిరుద్యోగులకు దక్కాల్సిన దుకా ణాలను అనర్హులకు కేటాయించడం దారుణమ న్నారు. అధికార మదంతో నిరుద్యోగుల హక్కు లను కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రభు త్వం వెంటనే స్పందించి కేటాయింపులపై సమ గ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రిలేనిరహార దీక్షలో పాల్గొంటున్న చెన్నయ్య, ఎడ్ల బాలరాజు, కమటం చిన్న, బాలరాజు, బి. శేఖర్‌, ఎన్‌.రాజు, వల్లభ శ్రీను,, ఎన్‌.నాని, డి. మల్లేష్‌, దార మల్లేష్‌, ఎస్‌.శ్రీనివాసులుతో పా టు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొ న్నారు.

Updated Date - Jun 28 , 2026 | 11:57 PM