Share News

భూభారతి పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:37 PM

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయ భవన సమావేశ మందిరంలో భూ భారతి పోర్టల్‌లోని పాస్‌బుక్‌ డేటా సవరణ సేవపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

భూభారతి పరిష్కారంలో జాప్యం చేయొద్దు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాములు

అదనపు కలెక్టర్‌ రాములు

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయ భవన సమావేశ మందిరంలో భూ భారతి పోర్టల్‌లోని పాస్‌బుక్‌ డేటా సవరణ సేవపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పోర్టల్‌లో పాస్‌బుక్‌ డేటా సవరణకు సంబంధించిన విధి విధానాలు, దరకాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు జీవో నెంబరు 59,76లకు సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన విచారణలు, పరిశీలనలు పూర్తి చేసి రికార్డులను సిద్దంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి శ్రీనివాసరావుదేశ్‌పాండే, సూపరిండెంట్‌లు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

-సీఎంఆర్‌ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలి

జిల్లాలో రైసుమిల్లుల యజమానులు సీఎంఆర్‌ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు పేర్కొన్నారు. గురువారం ఆయన చాంబర్‌లో రైసుమిల్లుల యజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ బియ్యం డెలివరీ లో వెనకబడిన మిల్లులు తమ పనితీరును మెరుగు పర్చుకుని బియ్యం అప్పగింతలను వేగవంతం చేయాలన్నారు. సీఎంఆర్‌ బియ్యం లక్ష్యాల సాదనలో ఆలస్యం జరగకుండా మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్‌, మేనేజర్‌ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:37 PM