Share News

చట్టాల అమలులో రాజీ పడవద్దు

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:25 PM

పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చట్టాల అమలులో రాజీపడవద్దని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. శనివారం జైపూర్‌ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

చట్టాల అమలులో రాజీ పడవద్దు

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

జైపూర్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చట్టాల అమలులో రాజీపడవద్దని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. శనివారం జైపూర్‌ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు . దర్యాప్తులో ఉన్న కేసులు, వాటి పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల స్థితి గతులు, పెండింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తలో జాప్యానికి గల కారణాలను ఏసీపీ వెంకటేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు మెరుగైన పోలిసింగ్‌ అందించడంతో పాటు ప్రతి కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు డీసీపీకీ ఏసీపీ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐలు నవీన్‌కుమార్‌, బన్సీలాల్‌, కృష్ణ, ఎస్‌ఐ భూమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:25 PM