మామిడి కోతల అనంతరం నిర్లక్ష్యం వద్దు..
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:12 PM
మామిడి కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది రైతులు కోతల తరువాత తోటలను నిర్లక్ష్యం చేస్తారు. తోటల్లో ఇప్పుడేం పని అంటూ అటువైపు వెల్లడమే మానేస్తారు. కాత కా సిన చెట్లు కోతల తరువాత నీరసించి పోతాయి.
-చెట్లు నీరసించి ఎండిపోయే ప్రమాదం
-అంతర కృషి... కొమ్మ కత్తిరింపులు కీలకం
-చీడపీడల నివారణకు మందుల పిచికారి చేయాలని సూచన
నెన్నెల, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : మామిడి కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది రైతులు కోతల తరువాత తోటలను నిర్లక్ష్యం చేస్తారు. తోటల్లో ఇప్పుడేం పని అంటూ అటువైపు వెల్లడమే మానేస్తారు. కాత కా సిన చెట్లు కోతల తరువాత నీరసించి పోతాయి. ఈ సమయంలో తోటలను పట్టించుకోక పోతే కొన్ని చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. చెట్లు కోలుకోక వచ్చే సంవత్సరపు దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంద ని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉధ్యాన శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి పేర్కొన్నారు. సకాలంలో సస్యరక్ష ణ చర్యలు చేపడితేనే తోటలు ఆరోగ్యంగా ఉంటాయని.. తదుపరి పంటకాలంలో మంచి దిగుబడులు వస్తాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం తోటల్లో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలగూర్చి ఆమె వివరించారు.
-తోటల పరిశుభ్రత
కోతలు పూర్తి అయిన వెంటనే చెట్ల కింద పడిపో యిన పండ్లు, ఎండిన ఆకులు, వ్యాధిసోకిన కొమ్మలను తొలగించాలి. చెట్ల చుట్టు కలుపు మొక్కలను తీసేసి తో టలను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త మొక్కల అవ శేషాలను తోట బయట గుంతలు తీసి పూడ్చివేయాలి.
-కొమ్మల కత్తిరింపు
ఎండిపోయిన, విరిగిన, ఒకదానిపై మరొకటి పెరిగిన కొమ్మలను తొలగించాలి. చెట్టు మధ్య భాగంలో గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించేలా కత్తిరింపు చేయాలి. పెద్ద కొమ్మలు కోస్తే కోసిన చోట బోర్డు పేస్టు లేదా కా పర్ ఆక్సిక్లోరైడ్ పూయాలి. కత్తిరించిన కొమ్మలను తోటబయటకు తరలించాలి.
-ఎరువుల యాజమాన్యం
పదేళ్ల కంటే ఎక్కువ వయసు గల చెట్టుకు 50 నుం చి 100 కేజీల పశువుల ఎరువు వేయాలి. 2.2 కేజీల యూరియా, 6 కేజీల సింగిల్ సూపర్ పాస్పెట్, 1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఎరువులను చెట్టు నీడలో వలయాకారంలో 15 నుంచి 20 సెంటీ మీటర్ల లోతులో వేసి మట్టి కప్పివేయాలి.
-సూక్ష్మపోషకాల పిచికారి
చెట్లకు కొత్త చిగుళ్లు వచ్చిన 20-30 రోజుల తర్వాత జింక్ పాస్పెట్ 5 గ్రామలు, బొరాక్స్ 1 గ్రాము, మెగ్నీషి యం 5 గ్రామలు ఒక లీటరు నీటికి వేసి పిచికారి చేసు కోవాలి. లేదా మ్యాంగో మైక్రో న్యూట్రియంట్ మిశ్రమం లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున వేసి స్ర్పే చేసుకోవాలి.
-నీటి యాజమాన్యం
వర్షాలు కురిసే వరకు 10-15 రోజుల వ్యవధిలో నీ రు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉన్న తోటల్లో మట్టిలో తేమను బట్టి నీరు ఇవ్వాలి. వర్షాకాలంలో అధిక వర్షపా తం కారణంగా నీరు నిల్వ కుండా చూసుకోవాలి. చెట్ల చుట్టూ మల్చింగ్ చేయడం ద్వారా నేల తేమను కాపా డుకోవచ్చు. గాలివానకు విరిగిన కొమ్మలను వెంట వెంటనే తొలగించాలి.
-అంతర పంటలు
చిన్న వయసుగల తోటల్లో అంతరపంటగా పెసర, మినుములు, కంది, అలసంద వేసుకుని ఆదాయం పొం దవచ్చు. అంతర పంటలతో తోటల్లో భూసారం కూడా పెరుగుతుంది.
-పురుగులు, వ్యాధుల నివారణ
వర్షాకాలంలో తోటను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అధిక వర్షాలతో వ్యాధుల పొంచిఉంటాయి. మ్యాంగో హార్పర్, మీలీబగ్, కొండం తొలిచేపురుగు, ఆకుమడత పురగు, పండుఈగ, త్రిప్స్, ఆంత్రక్నోస్, పౌ డరీ మిల్డ్యూ తదితర పురుగు సోకి చెట్లకు నష్టం చేకూ రుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిఫుణులను సంప్రదిం చి వారు సూచించిన మందులను తగిన మోతాదులో పిచికారి చేసుకోవాలి.
-సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి
డాక్టర్ యు. స్రవంతి, ఉద్యాన శాస్త్రవేత్త, కేవీకే బెల్లంపల్లి
రాబోయే సీజన్‌లో మామిడితోటల్లో అధిక పూత, మంచి దిగుబడులు పొందాలంటే కోతల అనంతరం తో టల్లో తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కా యలు కోసిన తర్వాత చెట్లు నీరసించి పోతాయి. నీటి తడులు అందించి చెట్లకు కావల్సిన పోషకాలను అందిం చాలి. సేంద్రీయ ఎరువులతో పాటు తగిన మోతాదులో రసాయనిక ఎరువులు వేసుకోవాలి. చెట్ల సందుల్లో కలు పు మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలి. తోటల నిర్వహనను నిర్లక్ష్యం చేయకుండా కొమ్మ కత్తిరింపులు, ఎరువుల వినియోగం, సూక్ష్మపోషకాల పిచికారి, పురుగు లు, వ్యాధుల సమగ్ర నివారణ చేపడితే తోటలు ఆరో గ్యంగా ఉంటాయి. తదుపరి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.