చట్టసభలకు వెళ్లేందుకు సీఎం భార్యకూ అవకాశం
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:11 AM
మహిళా రిజర్వేషన్‌లు అమలయితే సీఎం రేవంత్ భార్యకు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు...
మహిళా రిజర్వేషన్‌లతో కొత్త యుగానికి నాంది : అరుణ
హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌లు అమలయితే సీఎం రేవంత్ భార్యకు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ చెప్పారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లు రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది కాబోతున్నాయన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లతోనే 2029లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈనెల 16నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోందని తెలిపారు. డీలిమిటేషన్ అనంతరం, తెలంగాణాలో 60 మంది మహిళలు అసెంబ్లీలో, 9 మంది పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.