kumaram bheem asifabad- డీజే దరువు.. గుండెల్లో బరువు
ABN , Publish Date - May 20 , 2026 | 10:19 PM
సందర్భం ఏదైనా.. శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్‌గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్‌లు సవ్వసాధారణమవుతున్నా యి. రాజకీయ, సామాజిక వర్గాల ప్రదర్శనలు దగ్గరి నుంచి మొదలుకుని వివాహ శుభకార్యాల బరాత్ (ఊరేగింపు), దైవ విగ్రహాల ప్రదర్శన వరకు ఎక్కడ చూసినా డీజే శబ్దాలు మోత మోగిపోతు న్నాయి. ఇప్పుడు వివాహ శుభకార్యాల సమయం కావడంతో పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లోను డిజే సంప్రదాయంగా మారింది.
- వేడుకలు, ఫంక్షన్లలో తప్పనిసరిగా మారిన తంతు
వాంకిడి, మే 20 (ఆంధ్రజ్యోతి): సందర్భం ఏదైనా.. శబ్దాలమోత ఇప్పుడు ష్యాషన్‌గా మారింది. అందులో ప్రధానంగా డీజే బాక్స్‌లు సవ్వసాధారణమవుతున్నా యి. రాజకీయ, సామాజిక వర్గాల ప్రదర్శనలు దగ్గరి నుంచి మొదలుకుని వివాహ శుభకార్యాల బరాత్ (ఊరేగింపు), దైవ విగ్రహాల ప్రదర్శన వరకు ఎక్కడ చూసినా డీజే శబ్దాలు మోత మోగిపోతు న్నాయి. ఇప్పుడు వివాహ శుభకార్యాల సమయం కావడంతో పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లోను డిజే సంప్రదాయంగా మారింది. అనుమతులు లేవంటున్న అధికారులు నియంత్రిం చడంలో విఫలమవుతున్నారు. పోలీస్ స్టేషన్ల ముందు నుంచే గుండెలు అదిరిపోయే దరువుతో ప్రదర్శనలు కొనాగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మితిమీరిన శబ్దం గుండేలయ తప్పించే ప్రమాద ముంది. డీజే శబ్దాలతో వృద్దులు, పిల్లలతో పాటు యువతా బలవుతున్నారు. హుషారుగా నృత్యం చేస్తున్న యువకులు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. అధికశబ్దాలతో గర్భంలోని శిశువుల పైకూడా దుష్ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతు న్నారు. ఉత్సవాల వేళ జనం భారీసౌండ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చెవులు సహజంగా భరిం చే స్థాయిని మించడం వల్ల చెవి సంబంధిత సమస్యలు ఎదర్కొనే పరిస్థితి. డీజే మోత కారణంగా గతంలో భమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల తదితర జిల్లాల్లో మంరణించిన సంఘటణలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆప్ లేబర్ ఇండస్ట్రీ యాక్టు ప్రకారం పాటించాల్సిన నిబంధనలు అమలుకు నోచుకోవడంలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
- ఒక్కోసారి ప్రాణాంతకం..
డీజే శబ్దం ప్రారంభం నుంచే 100 డిసెబుల్స్ ఉం టుంది. సాధారణంగా చెవి వినికిడి సామర్థ్యాని కంటే అదనంగా 20 డెసిబుల్స్‌తోనే ప్రారంభం అవుతుంది. 130 డిసెబుల్స్‌కి మించి అంతకంటే ఎక్కువైతే వనికిడిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. డీజే సౌండ్స్ గంటల కొద్ది వినడం వల్ల కొంత మందికి తాత్కాలికంగా చెవుడు ప్రారం భమై కొన్ని రోజులకు సాధారణ స్థితికి వినికిడి సమస్య వచ్చే అవకాశాలుంటాయి. 130 డిసెబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఎక్కువ సమయం వింటే చెవిలో ఉం డే చిన్న చిన్న హియరింగ్ సెల్స్ చనిపోయి శాశ్వతంగా చెలి వినికిడి సామర్థ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
- గుండెకు భారమే....
ఒకేసారి చెవి సామర్థ్యానికి మించిన శబ్దం వింటే టసాస్టిక్ ట్రామా బారిన పడాల్సి వస్తుంది. మొదడు లో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి అకస్మాత్తుగా గుండె పోటు వచ్చే అవకాశాలుం టాయని వైద్యులు చెబుతున్నారు. శబ్దం తీవ్రత పెరుగుదల వల్ల ఎండోసిలియల్ సెల్స్ దెబ్బ తిని దీర్ణకాలంలో గుండె పోటు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. సాధారణ వ్యక్తుల కంటే గుండె సంబంఽధిత సమస్యలున్న వారికి డీజే శబ్దం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయనేది వ్యైనిపుణులు సూచిస్తున్నారు.
- నిబంధనలు ఇలా..
నిబంధల ప్రకారం 70 డిసిబుల్స్ సౌండ్ వరకే పరిమితి ఉంది. అంతకు మించితే చట్టరిత్య నేరం. రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య భారీశబ్దాలతో ఎలాంటి వేడుకలు, ఊరేగింపులు చేయకూడదు. ఆస్ప త్రులు, పాఠశాలలు, కోర్టులను నిశబ్ద జోన్లుగా పరిగణి స్తారు. అధికార యంత్రాంగం అమలుకు చర్యలు చేపడుతన్న ప్పటికీ ప్రజాప్రతినిధులు, రాజకీయ శ్రేణులు, వివిధ సంఘాల ఒత్తిడులతో ముందడుగు వేయడంలేదు. సాధారణంగా 70 డెసిబుల్స్ శబ్దాలను వినడానికి మానవుల చెవులు సహకరిస్తాయి. 70-85 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని ఏడు ననుంచి ఎనిమితి గంటలు, 90 డెసిబుల్స్ వరకు నాలుగు గంటల పాటువినవచ్చు. డీజే శబ్దం 200 డెసిబుల్స్ పైనే ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరం. భారీ సౌండ్ ప్రకంపనలకు చెవుల్లో సున్నిత కణాలు దెబ్బతింటాయి. కర్ణభేరి దెబ్బతిని శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తుంది. గుండె జబ్బులు ఉన్న వారికి తీవ్ర ప్రభావం చూపుతుంతి.
కేసులు నమోదు చేస్తాం..
- అశోక్, ఆసిఫాబాద్ డీఎస్పీ
ఎలాంటి వేడుకల్లో అయినా డీజేలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైనా డీజే పెడితే వెంట నే సీజ్ చేయాలని సంబంధిత ఎస్సైలను ఆదేశించాం. ఎవరైనా డీజే పెడితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ గమనించాలి.