ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు..
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:23 PM
కార్పొరేషన్ పరిధిలోని 32,37 డివిజన్లలో ఆదివారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్, డీసీసీ అధ్యక్షుడు, కొక్కిరాల సురేఖ
నస్పూర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్ పరిధిలోని 32,37 డివిజన్లలో ఆదివారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. లబ్ధిదారు లకు నూతన వస్ర్తాలను అందించి టపాసులు పేల్చా రు. లబ్ధిదారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, 37వ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఖలీద్, జిల్లా హౌసింగ్ శాఖ ప్రాజెక్టు ఆఫీసర్ బన్సీ లాల్, ఏఈ ప్రశాంతి, సలోమి రాణి, చందులాల్ లతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు
మందమర్రి టౌన్,(రామకృష్ణాపూర్) నవంబర్ 9(ఆంధ్రజ్యోతి) : చెన్నూ రు నియోజకవర్గంలో తొలి విడత 3500 ఇందిరమ్మ గృహాలు మంజూర య్యాయని డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, పట్టణ అ ధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం దీపావళి సందర్భంగా క్యాతన్‌పల్లి మున్సిపాలి టీలోని 5వ వార్డు అమరవాది, 9వ వార్డు పాత తిమ్మాపూర్ లలో ఇందిరమ్మ లబ్దిదారులతో దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాముక శీరిష రమేష్, గుర్రం శ్రీనివాస్, మల్లేష్, కూతురు ప్ర భాకర్, నాయకులు పాల్గొన్నారు.