Share News

సింగరేణిలో దీపావళి బోనస్‌...

ABN , Publish Date - Oct 30 , 2026 | 10:38 PM

సింగరేణి కార్మికులకు దీపావళి (పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ రివార్డ్‌) బోనస్‌ రూ. 419 కోట్లను యాజమాన్యం కేటాయించ గా, వచ్చే నెల 5వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

సింగరేణిలో దీపావళి బోనస్‌...

-ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-వచ్చే నెల 5వ తేదీన కార్మికుల అకౌంట్లలో జమ

-ఒక్కో కార్మికుడికి రూ. లక్షా పది వేలు చెల్లింపు

-రూ. 419 కోట్లు కేటాయించిన యాజమాన్యం

మంచిర్యాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు దీపావళి (పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ రివార్డ్‌) బోనస్‌ రూ. 419 కోట్లను యాజమాన్యం కేటాయించ గా, వచ్చే నెల 5వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీపావళి బోనస్‌ చెల్లించనున్నట్లు శుక్రవా రం ప్రకటించారు. యాజమాన్యం ప్రకటించిన బోనస్‌ ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు మాత్రమే చెల్లించనుండ గా, అధికారులకు వర్తించదు. కోలిండియా నిర్ణయానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం చర్యలు చేప ట్టడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో కార్మికుడికి రూ. లక్షా పై చిలుకు చెల్లింపు....

ప్రతి సంవత్సరం మాదిరిగానే దీపావళి బోనస్‌ను యాజమాన్యం ముందస్తుగా ప్రకటించింది. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న సుమారు 38వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి వారు పనిచేసిన మ స్టర్లను బట్టి గరిష్టంగా ఒక్కొక్కరికి రూ. లక్షా పదివేల 250 వరకు బోనస్‌ అందనుంది. నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల విభాగంలో 190 పని దినాలు, ఓపెన్‌ కాస్ట్‌, సర్ఫేస్‌ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తిస్థాయిలో బోనస్‌ చెల్లించనున్నారు. అంతకంటే తక్కువ పని ది నాల హాజరు కలిగిన కార్మికులకు వారు పనిచేసిన కా లానికి నిష్పత్తి ప్రకారం బోనస్‌ను లెక్కగట్టి చెల్లించ నున్నారు. బోనస్‌కు అర్హత పొందడానికి ప్రతి కార్మి కుడు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 రోజులు పని చేసి ఉండాలని సంస్థ నిర్ణయించింది. బోనస్‌ను యాజమాన్యం ప్రతియేటా పెంచుతూ వస్తుండటంతో కార్మిక కుటుంబాల్లో అనందం వెల్లివిరుస్తోంది.

కార్మికుల సంక్షేమం కోసం....

సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి పె ద్దపీట వేస్తోంది. మొన్న దసరా పండుగను పురస్క రించుకొని లాభాల వాటాను 34 శాతం అందజేయగా, ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ. లక్షా 50వేల వరకు నగదును బ్యాంకుల్లో జమ చేసింది. ప్రస్తుతం దీపావళి బోనస్‌ను కూడా అందజేస్తుండగా, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ప్రగతి బాట న పయనిస్తున్న కంపెనీ కార్మికుల సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తోంది. నెల రోజుల వ్యవధిలో దసరా, దీపా వళి బోనస్‌ల రూపంలో ఒక్కో కార్మికుడికి సగటున రూ. 2 లక్షల 60వేల వరకు లభిస్తోంది. ఈ రెండు బో నస్‌లకు కలిపి సింగరేణి యాజమాన్యం మొత్తంగా రూ. 1019 కోట్లు కేటాయించడం గమనార్హం. కాగా దీ పావళి బోనస్‌ తొలిసారిగా సింగరేణిలో 1963లో అమ ల్లోకి రాగా, 1964 నుంచి చెల్లింపులు చేస్తున్నారు. బో నస్‌ రావడానికి కారణం ఏఐటీయూసీ కృషి ఉండగా, 1964లో అప్పటి యూనియన్‌ అధ్యక్షుడు విఠల్‌రావు చొరవతో యాజమాన్యం బోనస్‌ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఒక్క సింగరేణిలోనే బోనస్‌ అ మలుకాగా 1965లో చట్టం వచ్చిన తరువాత అన్ని కం పెనీల్లో కార్మికులకు బోనస్‌ అందుతోంది. కాగా కార్మి కులు బోనస్‌ల సొమ్మును తమ కుటుంబ అవసరాల కు వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ బుద్ద ప్రకా ష్‌ జ్యోతి సూచించారు. బొగ్గు రంగంలో పోటీని అధిగ మించేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

గుర్తింపు యూనియన్‌ కృషితోనే....

ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బో నస్‌ పెంచడంలో గుర్తింపు యూనియన్‌ అయిన ఏఐ టీయూసీ కృషి ఎంతో ఉంది. ప్రతియేట మాదిరిగానే కార్మికులకు బోనస్‌ చెల్లించాలని యాజమాన్యాన్ని కో రడంతో సానుకూలంగా స్పందించింది. కార్మికుల సంక్షే మం కోసం యూనియన్‌ చేస్తున్న కృషిని గుర్తించాలి.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు.....

ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనస్‌ ప్రకటిం చడం సంతోషదాయకం. నవంబరు 5న బోనస్‌ జమ చేయనున్నట్లు ప్రకటించడంతో కార్మిక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Updated Date - Oct 30 , 2026 | 10:38 PM